రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో మన విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:18 AM
జిల్లాకు చెందిన విద్యార్థులు బుధవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో మంత్రులుగా వ్యవహరిస్తూ.. తమ వాగ్ధాటితో అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులపై సోషల్ మీడియా చెడు ప్రభావం పడకుండా ప్రత్యేకంగా రూపొందించిన బిల్లును చిన్మయి ప్రవేశపెట్టారు.
రైతే రాజయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలను పంపిణీ చేస్తాం. మంతా తుఫానువల్ల వరదలు వచ్చిన ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాం.
- వ్యవసాయ శాఖ మంత్రిగా గూడూరు జడ్పీ బాలుర పాఠశాల విద్యార్థి సాగర్ కుమార్.
పుస్తకాల బరువు తగ్గిస్తాం. సెమిస్టర్ సిస్టం అమలు చేస్తాం. పాఠశాలలను డ్రగ్స్‌రహితంగా చేస్తాం. అందుకు అవసరమైన ప్రణాళికను రచించాం.
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా తిరుచానూరు జడ్పీహెచ్‌ఎ్‌స విద్యార్థిని చిన్మయి విద్య.
.. ఇలా మన జిల్లాకు చెందిన విద్యార్థులు బుధవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో మంత్రులుగా వ్యవహరిస్తూ.. తమ వాగ్ధాటితో అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులపై సోషల్ మీడియా చెడు ప్రభావం పడకుండా ప్రత్యేకంగా రూపొందించిన బిల్లును చిన్మయి ప్రవేశపెట్టారు. ఇక, తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని భవ్యశ్రీ ప్రతిపక్ష సభ్యునిగా.. సైదాపురం జడ్పీహెచ్‌ఎ్‌స విద్యార్థి వెంకట దినకర్ మార్షల్ పాత్ర పోషించారు. కార్యక్రమం అనంతరం వీరిని మంత్రి నారా లోకేశ్ తదితరులు ప్రశంసించారు.
- తిరుపతి(విద్య), ఆంధ్రజ్యోతి