Share News

మన ఆణిముత్యాలు

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:35 AM

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలు ప్రైవేటు జూనియర్‌ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

మన ఆణిముత్యాలు
భానుచరణ్‌రెడ్డి

తిరుపతి(విద్య), జూన్‌ 8: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలు ప్రైవేటు జూనియర్‌ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

ఇంజినీరింగ్‌ విభాగంలో అగ్రగణ్యులు

తిరుపతికి చెందిన భానుచరణ్‌రెడ్డి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించి జిల్లాలో అగ్రగణ్యుడిగా నిలిచారు. అలాగే మణిదీ్‌పరెడ్డి 7వ ర్యాంకు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. ఆరుష్‌ లక్ష్మణ్‌ 45, ధనుష్‌ 59, యశ్విత 69వ ర్యాంకుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక, అరుణ్‌కుమార్‌ రెడ్డి 125, యశ్వంత్‌ 135, లావణ్య 230, లక్ష్మీసహస్ర 322, జెశ్విత 398, జాశ్విత 444, శివకృతిక్‌ 492 ర్యాంకులు సాధించారు. వీరిలో కొందరికి జేఈఈలోనూ మంచి ర్యాంకులు వచ్చాయి.

బైపీసీ విభాగంలో తిరుపతికి చెందిన ఒ.ఆరుష్‌ లక్ష్మణ్‌ రాష్ట్రస్థాయిలో 45, చంద్రగిరికి చెందిన మౌనిక 94వ ర్యాంకు సాధించి జిల్లా టాపర్లుగా నిలించారు.

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో రీసెర్చ్‌

తిరుపతి ఎం.ఆర్‌.పల్లె అమరావతి నగర్‌కు చెందిన ప్రైవేట్‌ అధ్యాపకుడు (గణితం) ఎం.జైభారత్‌రెడ్డి, ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలు సురేఖ దంపతుల కుమారుడు మాండవ్యపురం భానుచరణ్‌రెడ్డి తిరుపతి నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఏపీ ఈఏపీ సెట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన ఇతడు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఓపెన్‌ కేటగిరీలో జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్‌ కేటగిరీలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో ఓపెన్‌ ర్యాంకు 158, ఈడబ్ల్యుఎ్‌సలో 7, జేఈఈ బీఆర్క్‌లో ఓపెన్‌ కేటగిరీలో 54, ఈడబ్ల్యుఎ్‌సలో 3వ ర్యాంకు సాధించారు. ముంబై ఐఐటీలో బీటెక్‌ చదివి, ఆ తర్వాత క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో రీసెర్చ్‌ చేయాలన్నది తన ఆశయమని భానుచరణ్‌రెడ్డి తెలిపారు.

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సీఎ్‌సఈ

తిరుపతి విద్యానగర్‌ గౌతం నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గిరిజాప్రసాద్‌రెడ్డి, అగ్రికల్చరల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ అమరావతి దంపతుల కుమారుడు దేశిరెడ్డి మణిదీ్‌పరెడ్డి ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 7వ ర్యాంకు సాధించారు. తిరుపతి నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివారు. జేఈఈ మెయిన్స్‌లో 274, అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 345వ ర్యాంకు సాధించాడు. జేఈఈ ర్యాంకు ద్వారా ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సీఎ్‌సఈ చదవాలన్నది తన ఆశయమని మణిదీ్‌పరెడ్డి చెప్పారు.

టాప్‌ 7 ఐఐటీల్లో బీటెక్‌

తిరుపతి ఎం.ఆర్‌.పల్లెకు చెందిన సబ్‌ ట్రెజరరీ అధికారి (శ్రీకాళహస్తి) సి.వెంకటరమణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సి.విజయ దంపతుల కుమారుడు బీవీ ధనుష్‌ ఏపీ ఈఏపీ సెట్‌లో 59వ ర్యాంకు సాధించారు. తిరుపతి నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివిన ఇతడు జేఈఈ మెయిన్స్‌లో 466 ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 1208 ర్యాంకు పొందాడు. టాప్‌ 7 ఐఐటీల్లో బీటెక్‌ సీఎ్‌సఈ చదవాలన్నది తన కోరికని, అందుకే జేఈఈ ర్యాంకింగ్‌తో టాప్‌ 7 ఐఐటీల్లో సీటు కోసం ప్రయత్నిస్తానని ధనుష్‌ చెప్పారు.

ఐఐటీ ముంబైలో చదువుతా

తిరుపతి ఎస్వీ నగర్‌కు చెందిన కెమిస్ట్రీ అధ్యాపకుడు కె.నాదమునిరెడ్డి, ఎం.బిందు దంపతుల కుమార్తె కళత్తూర్‌ యశ్విత ఈఏపీ సెట్‌లో 69వ ర్యాంకు సాధించారు. తిరుపతి నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివిని ఈమె జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయి ర్యాంకు 1535, ఈడబ్ల్యుఎ్‌సలో 122వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో ఓపెన్‌ కేటగిరీలో 906వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్‌ కేటగిరీలో 67వ ర్యాంకు పొందారు. ముంబై ఐఐటీలో సీఎ్‌సఈ చదవాలనేది తన ఆశయమని, ఆమేరకు జేఈఈ ద్వారా చేరనున్నట్లు చెప్పారు.

న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో మెడిసిన్‌

తిరుపతిలోని ఆర్థో డాక్టర్‌ కిరణ్‌, ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ శైలజ దంపతుల కుమారుడు ఒ.ఆరుష్‌ లక్ష్మణ్‌ ఈఏపీ సెట్‌ మెడికల్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 45వ ర్యాంకు సాధించారు. తిరుపతిలోని శ్రీచైతన్యలో ఇంటర్‌ చదివిన ఈయన.. న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్‌ సైన్సె్‌సలో మెడిసిన్‌ చదవాలన్నది తన ఆశయమని చెప్పారు. అందుకోసమే నీట్‌ రాశానని, ఆ ఫలితాలు వెలువడిన తర్వాత తదుపరి కార్యాచరణను రూపొందించుకుంటానని ఆరుష్‌ తెలిపారు.

ఎస్వీ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌

తిరుపతి ఎంఆర్‌పల్లె అమరావతినగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్‌కుమార్‌ (చంద్రగిరి హెడ్‌ పోస్టాఫీస్‌ పోస్టల్‌ అసిస్టెంట్‌ ), శ్రీలత దంపతుల కుమార్తె ఎ.మౌనిక తిరుపతి నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఈఏపీ సెట్‌ మెడికల్‌ విభాగంలో 94వ ర్యాంకు సాధించారు. నాన్న డాక్టర్‌ అవ్వాలనుకున్నప్పటికీ పరిస్థితుల కారణంగా ఆయన కాలేకపోయారని, అది చిన్న్పటినుంచీ వింటున్న తనలో డాక్టర్‌ కావాలనే పట్టుదల పెరిగిందని ఆమె చెప్పారు. ఆమేరకు తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ చదువుతానని చెప్పారు. తాను ఇటీవల నీట్‌ రాశానని, అందులో మంచి ర్యాంకు వచ్చినప్పటికీ తిరుపతిలోనే చదవాలనుకుంటున్నట్టు మౌనిక వెల్లడించారు.

Updated Date - Jun 09 , 2025 | 12:35 AM