ఆరు కుంకీలతో ఆపరేషన్
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:41 AM
పంటపొలాలపై దాడులు చేస్తున్న ఏనుగుల ఆట కట్టించేందుకు మరోసారి కుంకీలను అటవీప్రాంతానికి తరలించారు.
బంగారుపాళ్యం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): పంటపొలాలపై దాడులు చేస్తున్న ఏనుగుల ఆట కట్టించేందుకు మరోసారి కుంకీలను అటవీప్రాంతానికి తరలించారు.గురువారం సాయంత్రం బంగారుపాళ్యం మండలంలోని కీరమంద,కొదలమడుగు అటవీ పరిసర ప్రాంతాలకు ఆరు కుంకీ ఏనుగులను తరలించారు.వీటిలో కర్ణాటక రాష్ట్రం నుంచి రప్పించిన రంజన్,దేవ,అభిమన్య,కృష్ణతో పాటు రామకుప్పం మండలం ననియాల తాండా శిబిరం నుంచి తీసుకొచ్చిన వినాయకం,జయంత్ ఏనుగులున్నాయి. కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులు సంచరిస్తున్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.పలమనేరు సబ్ డీఎ్‌ఫవో వేణుగోపాల్ ఆధ్వర్యంలో 12మంది మావటీలు,40 మంది అటవీశాఖ సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌ను డీఎ్‌ఫవో భరణి గురువారం రాత్రి కీరమంద అటవీప్రాంతానికి చేరుకుని పర్యవేక్షించారు.