రైళ్లలో చోరీ కేసుల్లో ఓజీకుప్పంవాసుల అరెస్టు
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:59 AM
రైళ్లలో ప్రయాణికుల వస్తువుల చోరీకి పాల్పడుతున్న కేసుల్లో ఐదుగురు నిందితులను విజయవాడలో రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేశారు.ఇటీవల విజయవాడకు వచ్చే పలు రైళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
విజయవాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రైళ్లలో ప్రయాణికుల వస్తువుల చోరీకి పాల్పడుతున్న కేసుల్లో ఐదుగురు నిందితులను విజయవాడలో రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేశారు.ఇటీవల విజయవాడకు వచ్చే పలు రైళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.జీఆర్పీ సీఐ జేవీ రమణ, ఆర్పీఎఫ్ ఎస్‌ఐ ఆలీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్టేషన్ ప్రాంగణంలో ఉన్న సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించారు. శనివారం విజయవాడలోని రైల్వే మినీ స్టేడియం బస్టాప్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.వారు చిత్తూరు జిల్లా, నగరి మండలం, ఓజీ కుప్పం ప్రాంతానికి చెందిన గోగుల జానా నరసింహులు (55), పసుపులేటి సులోచన (61), పసుపులేటి బాబు (67), కె.జనార్దన్ (60)గా గుర్తించారు.వారి వద్ద వున్న సుమారు రూ.5లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.