ఏరియల్ సర్వే రద్దుతో వెనుదిరిగిన అధికారులు
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:28 AM
క్రిస్‌సిటీ భూములు.. పనులకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏరియల్ సర్వే రద్దవడంతో అధికారులు వెనుదిరిగారు.
కోట, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): క్రిస్‌సిటీ భూములు.. పనులకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏరియల్ సర్వే రద్దవడంతో అధికారులు వెనుదిరిగారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కలెక్టర్ వెంకటేశ్వర్‌తో కలిసి సోమవారం ఉదయం ఆయన కోట మండలం కొత్తపట్నం, చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని స్థానిక అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ఎపీఐఐసీ అధికారులు క్రిస్‌సిటీ భూములకు చేరుకున్నారు. ఏరియల్ సర్వే జరుగుతుందని నిరీక్షించారు. చివరి క్షణంలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపంవల్ల పర్యటన రద్దవడంతో వీరంతా వెనుదిరిగారు.