Share News

ఐఐటీ,ఐసర్‌లను సందర్శించిన ఒడిశా గవర్నర్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:14 AM

ఏర్పేడు వద్ద తిరుపతి ఐఐటీని ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు సోమవారం దర్శించారు. సంస్థ డైరెక్టర్‌ ప్రొపెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ అధ్వర్యంలో ఆయనకు అధ్యాపకులు స్వాగతం పలికారు.

ఐఐటీ,ఐసర్‌లను సందర్శించిన ఒడిశా గవర్నర్‌
ఐఐటీలో డీన్లు,అధ్యాపక బృందంతో సమావేశమైన డాక్టర్‌ హరిబాబు

ఏర్పేడు,ఆ గస్టు 4(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు వద్ద తిరుపతి ఐఐటీని ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు సోమవారం దర్శించారు. సంస్థ డైరెక్టర్‌ ప్రొపెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ అధ్వర్యంలో ఆయనకు అధ్యాపకులు స్వాగతం పలికారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తరువాత డీన్స్‌ అధ్యాపకులు, విభాగాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఎన్‌ఈపీ-2020 అమలు, పీవోఎ్‌ససీహెచ్‌ కేసుల సమయానుకూల పరిష్కారం, పరిశ్రమలతో కలిసి నైపుణ్యాతాభివృద్ధి కోర్సులు లాంటి అంశాలపై మాట్లాడారు. అధ్యాపకులు ఏటా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. అనంతరం డీఎస్టీ ఆధ్వర్యంలో ఐఐటీ టెక్నాలజీని పరిశీలించారు. ఒడిశా గవర్నర్‌ ఐసర్‌ను కూడా సందర్శించారు. సంస్థలో ఆధునిక మౌలిక సదుపాయాలను గురించి తెలుసుకుని అభినందించారు. త్రినేత్ర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. యాజమాన్యం, బోదన సిబ్బంది, విద్యార్థుల నిబద్ధతను కొనియాడారు. ఐసర్‌ డైరక్టర్‌ శాంతను బట్టాచార్య, రిజిస్టార్‌ ఇంద్రపీత్‌సింగ్‌ కోమ్లీ, జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 02:14 AM