Share News

మందులు వికటించి ఓవీ రమణకు అస్వస్థత

ABN , Publish Date - Dec 20 , 2025 | 03:06 AM

గుండెకు సంబంధించిన మందులు వికటించి టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ అస్వస్థతకు గురయ్యారు.

మందులు వికటించి ఓవీ రమణకు అస్వస్థత
స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓవీ రమణ

తిరుపతి(వైద్యం), డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): గుండెకు సంబంధించిన మందులు వికటించి టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ అస్వస్థతకు గురయ్యారు. రెగ్యులర్‌ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆయన తిరుపతిలోని స్విమ్స్‌కు వచ్చారు. గుండెకు సంబంధించి పరీక్షలు చేసి.. ఇంజక్షన్‌ వేశారు. ఈ క్రమంలో మందులు వికటించి ఆయన అస్వస్థతకు గురవడంతో ఐసీయూ వార్డుకు తరలించి వైద్యం అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఐసీయూ వార్డులో వైద్యుల పరిశీలనలో ఉంచారు.

Updated Date - Dec 20 , 2025 | 03:06 AM