Share News

ఎన్టీఆర్‌ వైద్యసేవలకు ఢోకా లేదు

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:41 AM

ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ఎన్టీఆర్‌ వైద్యసేవలను నిలిపివేయాలని నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించలేదు.

ఎన్టీఆర్‌ వైద్యసేవలకు ఢోకా లేదు

తిరుపతి/చిత్తూరు రూరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ఎన్టీఆర్‌ వైద్యసేవలను నిలిపివేయాలని నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించలేదు.చిత్తూరులోని మూడు ఆస్పత్రుల్లో ఓపీ సేవల కోసం వచ్చిన వారిని రెండ్రోజుల తరువాత రమ్మని పంపేశారు.తిరుపతి జిల్లావ్యాప్తంగా 38 నెట్‌వర్క్‌ ఆస్పత్రులుంటే 4 ఆస్పత్రుల్లో మాత్రమే ఓపీ సేవలు నిలిచాయి.వీటిల్లోనూ అత్యవసర వైద్యసేవలకు ఎక్కడా ఆటంకం జరగలేదని ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజశేఖర రెడ్డి తెలిపారు.అత్యవసర శస్త్రచికిత్సల నిర్వహణలో ఆస్పత్రుల యాజమాన్యాలు అశ్రద్ధ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.

Updated Date - Oct 12 , 2025 | 01:41 AM