Share News

ఎస్వీయూ, పద్మావతి వర్సిటీలకు ఎన్‌ఆర్‌ఎ్‌ఫ ర్యాంకులు

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:41 AM

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ)లో ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీకి ర్యాంకులు దక్కాయి.

ఎస్వీయూ, పద్మావతి వర్సిటీలకు ఎన్‌ఆర్‌ఎ్‌ఫ ర్యాంకులు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ)లో ఎస్వీయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీకి ర్యాంకులు దక్కాయి. ఎస్వీయూకు 47వ ర్యాంకు, పద్మావతి మహిళా యూనివర్సిటీకి 60వ ర్యాంకు దక్కింది. బోధన, పరిశోధన, విస్తరణ తదితర రంగాల్లో ఈ వర్సిటీల విశేష కృషికి గుర్తింపుగా ఈ ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకు రావడం పట్ల ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు, పద్మావతి వర్సిటీ వీసీ ఉమ, రిజిస్ట్రార్‌ రజని హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 05 , 2025 | 01:41 AM