ముక్కంటి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - May 31 , 2025 | 01:54 AM
శ్రీకాళహస్తీశ్వరాలయ వేదపండితుడు మారుతీశర్మపై ఈవో బాపిరెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. ప్రైవేటు ప్రాంగణమైన రాఘవేంద్రస్వామి మఠంలో గురువారం ముక్కంటి ఆలయ వేదపండితుడు హాజరై హీరో శ్రీకాంత్ కుటుంబీకులతో నవగ్రహ శాంతిపూజలు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
శ్రీకాళహస్తి, మే 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ వేదపండితుడు మారుతీశర్మపై ఈవో బాపిరెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. ప్రైవేటు ప్రాంగణమైన రాఘవేంద్రస్వామి మఠంలో గురువారం ముక్కంటి ఆలయ వేదపండితుడు హాజరై హీరో శ్రీకాంత్ కుటుంబీకులతో నవగ్రహ శాంతిపూజలు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది. శుక్రవారం ఈవో బాపిరెడ్డి దానిపై స్పందిస్తూ ఆలయ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేటు పూజల్లో పాల్గొన్న మారుతీశర్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.