యూరియా కొరత లేదు
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:33 AM
జిల్లాలో యూరియా కొరతలేదని.. రెండు నెలలకు సరిపడే 2 వేల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.పుంగనూరు సీడీసీఎంఎస్ గోదాములో రైతులకు యూరియా పంపిణీ చేయడంతో పాటు అక్కడున్న నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో వరిసాగు అధికంగా ఉండటంతో రెండు నియోజకవర్గాల్లో తనిఖీలు చేసి అదనంగా యూరియా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 వేల మంది రైతులకు ఆర్‌ఎస్‌కేలతో రైతుకు ఒక బస్తా చొప్పున 1500 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు వివరించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు మరొక బస్తా చొప్పున యూరియా అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ఏడాది జిల్లాలో 45 వేల హెక్టార్లలో పంటలు పండించగా 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 21 వేల హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. 13 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో 20 రోజుల తర్వాత మరో విడత పంపిణీ చేస్తామన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ మురళీధర్, పుంగనూరు ఏడీ శివకుమార్‌రాజు, తహసీల్దార్ రాము, ఏవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
- రెండు నెలలకు సరిపడా నిల్వలున్నాయన్న కలెక్టర్
పుంగనూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కొరతలేదని.. రెండు నెలలకు సరిపడే 2 వేల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.పుంగనూరు సీడీసీఎంఎస్ గోదాములో రైతులకు యూరియా పంపిణీ చేయడంతో పాటు అక్కడున్న నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో వరిసాగు అధికంగా ఉండటంతో రెండు నియోజకవర్గాల్లో తనిఖీలు చేసి అదనంగా యూరియా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 వేల మంది రైతులకు ఆర్‌ఎస్‌కేలతో రైతుకు ఒక బస్తా చొప్పున 1500 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు వివరించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు మరొక బస్తా చొప్పున యూరియా అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ఏడాది జిల్లాలో 45 వేల హెక్టార్లలో పంటలు పండించగా 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 21 వేల హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. 13 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో 20 రోజుల తర్వాత మరో విడత పంపిణీ చేస్తామన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ మురళీధర్, పుంగనూరు ఏడీ శివకుమార్‌రాజు, తహసీల్దార్ రాము, ఏవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.