Share News

అరెస్టుల్లేవు....రికవరీ లేదు

ABN , Publish Date - Jul 24 , 2025 | 02:06 AM

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ నిధులు రూ.1.36 కోట్ల దుర్వినియోగంపై జడ్పీ సీఈవో వెంకటనారాయణ విచారణ చేపట్టారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించి, నిధులు దుర్వినియోగం కావడానికి బాధ్యులైన అధికారులను ఆయన విచారించి సమగ్ర విచారణ కోసం రికార్డులు తీసుకెళ్లారు.

అరెస్టుల్లేవు....రికవరీ లేదు

23పీజీఆర్‌ 2: పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో వెంకటనారాయణ

-రూ.1.36 కోట్ల దుర్వినియోగంపై అనుమానాలున్నాయ్‌!

-జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటనారాయణ

పుంగనూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ నిధులు రూ.1.36 కోట్ల దుర్వినియోగంపై జడ్పీ సీఈవో వెంకటనారాయణ విచారణ చేపట్టారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించి, నిధులు దుర్వినియోగం కావడానికి బాధ్యులైన అధికారులను ఆయన విచారించి సమగ్ర విచారణ కోసం రికార్డులు తీసుకెళ్లారు.పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో నిధుల స్వాహా గురించి గత ఏడాది జూన్‌ 20న ‘అమ్మో..కాంట్రాక్టు ఉద్యోగి’ శీర్షికన ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఆన్‌లైన్‌ బెట్టింగులతో అప్పులపాలైన కంప్యూటర్‌ ఆపరేటర్‌ సునీల్‌ వాటిని తీర్చేందుకు ఎంపీడీవో లాగిన్‌ ఓపెన్‌ చేసి ప్రభుత్వ నిధులను సొంత ఖాతాలోకి మళ్లించుకున్న ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది.జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట నారాయణ మీడియాతో మాట్లాడుతూ 2023 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి వరకు 9 నెలల్లో పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో రూ.1.36 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. దీనిపై గతంలో డీఎల్‌డీవో వెంకటశేషయ్య విచారణ చేపట్టి తుదిదశలో బదిలీ కావడంతో ఆ బాధ్యతను జడ్పీ సీఈవో తనకు అప్పగించారని చెప్పారు. మాజీ ఎంపీడీవో రాజేశ్వరమ్మను, సీనియర్‌ అసిస్టెంట్‌ రాజశేఖర రెడ్డిని విచారించానని, టైపిస్టును, ఈవోపీఆర్డీని విచారించాల్సి ఉందని తెలిపారు. కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేసిన కంప్యూటరు ఆపరేటర్‌ సునీల్‌ తమను మోసగించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వారు తెలిపారన్నారు. కానీ సూపర్‌వైజరీ బాధ్యతల్లో ఉన్న అధికారులు బాధ్యతలు విస్మరించి కాంట్రాక్టు ఉద్యోగికి ప్రభుత్వ లాగిన్‌ వివరాలు తెలియజేయడం తప్పు అని తెలిపారు. గతంలో ఎంపీడీవో వెంకటమునిరెడ్డి ఈ నిధుల దుర్వినియోగంపై పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా ఇప్పటి వరకు అరెస్టులు జరక్కపోవడం, నిధుల రికవరీ కాకపోవడంపై అనుమానంగా ఉందని తెలిపారు. ఏ స్థాయిలో తప్పు జరిగింది, బాధ్యులు ఎవరు తదితర విషయాల్లో సమగ్ర విచారణ కోసం సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని చిత్తూరు తీసుకెళ్లి పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక జడ్పీ సీఈవోకు సమర్పిస్తానని ఆయన వివరించారు.

Updated Date - Jul 24 , 2025 | 02:06 AM