Share News

తగ్గని నీవా ఉధృతి

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:56 AM

ఎగువ ప్రాంతాలతో పాటు చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నీవానది పొంగిపొర్లుతోంది. రెండు రోజులుగా నీవానది ఉధృతంగా ప్రవహించడంతో స్థానికంగా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

తగ్గని నీవా ఉధృతి
నీవానది నుంచి స్థానికులను రక్షిస్తున్న రెస్క్యూటీమ్‌

చిత్తూరు అర్బన్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాలతో పాటు చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నీవానది పొంగిపొర్లుతోంది. రెండు రోజులుగా నీవానది ఉధృతంగా ప్రవహించడంతో స్థానికంగా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తేనబండ, వీఽరభద్రకాలనీ, రిక్షాకాలనీ, కైలాసపురం, రాజుగుడివీఽధి తదితర కాలనీలు వరదనీటితో మునిగిపోయాయి. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు రెస్క్యూ టీములతో సహాయక చర్యలు చేపడతున్నారు. సోమవారం చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జీ విజయానందరెడ్డి, ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపునకు గురైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాఽధితులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. 40,41వ డివిజన్ల నేతలు పీఎస్‌ చందు, భువనేశ్వరిల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. మాజీ సీకేబాబు తనయుడు సాయికృష్ణారెడ్డి, ఇతర పార్టీ నేతలు ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.

గంగాధరనెల్లూరు మండలంలో కుండపోత

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా వర్షం జిల్లాప్రజలను ఇబ్బందులపాల్జేస్తోంది. గడచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా గంగాధరనెల్లూరు మండలంలోన 108.4 మి.మీ, అత్యల్పంగా గుడుపల్లి, నగరిలలో 1.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. మండలాలవారీగా గుడిపాలలో 86.4, చిత్తూరు అర్బన్‌లో 40.2, చిత్తూరు రూరల్‌లో 38.4, పెనుమూరులో 25.8, శ్రీరంగరాజపురంలో 21.8, యాదమరిలో 21.4, తవణంపల్లెలో 18.2, బంగారుపాళ్యంలో 9.2, పులిచెర్లలో 9.0, పూతలపట్టు, రొంపిచెర్ల మండలాల్లో 6.4, సదుంలో 4.6, రామకుప్పంలో 4.0, బైరెడ్డిపల్లిలో 3.2, పలమనేరులో 2.8, వి.కోట, గంగవరం మండలాల్లో 2.4, కుప్పంలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదయింది.

Updated Date - Oct 14 , 2025 | 01:56 AM