Share News

అనుమతి లేకుండానే ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌!

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:26 AM

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో 56 పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అనుమతి లేకుండా దీన్ని విడుదల చేశారని ప్రచారం జరుగుతోంది.

అనుమతి లేకుండానే ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌!

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి):నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో 56 పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అనుమతి లేకుండా దీన్ని విడుదల చేశారని ప్రచారం జరుగుతోంది.ఈ విషయమై కమిషనరేట్‌ నుంచి జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ శాఖ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. దీంతో ఈ నోటిఫికేషన్‌ ముందుకు సాగేలా కనపడలేదు.నోటిఫికేషన్‌కు దరఖాస్తు ఫీజు కూడా ఎప్పుడూ లేనట్టు రూ.500 నిర్ణయించడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నోటిఫికేషన్‌లో పోస్టులకు రోస్టర్‌ను తెలియజేయకపోవడంతో అనర్హులు కూడా దరఖాస్తు చేసి డబ్బు, సమయం వృథా చేసుకునే అవకాశముంది.

పోస్టుల వివరాలివే

మెడికల్‌ ఆఫీసర్లు- 13, స్టాఫ్‌ నర్సులు- 20, ఫైనాన్స్‌ కమ్‌ లాజిస్టిక్‌ కన్సల్టెంట్‌- 1, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2- 3, ఫిజియోథెరఫిస్ట్‌- 1, ఆడియో మెట్రి- 2, సపోర్టింగ్‌ అటెండెంట్‌- 2, సపోర్టింగ్‌ స్టాఫ్‌- 4, సెక్యూరిటీ గార్డ్‌- 2, లాస్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌- 8. ఈ పోస్టులకు గాను ఈ నెల 9 నుంచి 15వ తేది వరకు మెడికల్‌ ఆఫీసర్లకు 20 మంది, ఫైనాన్స్‌ కమ్‌ లాజిస్టిక్‌ కన్సల్టెంట్‌ పోస్టుకు నలుగురు, స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు 326మంది, సపోర్టింగ్‌ స్టాఫ్‌కు 32మంది,లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌కు 24 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది.

Updated Date - Oct 16 , 2025 | 02:26 AM