Share News

కొత్త బ్యాంకు శాఖలు వస్తున్నాయి

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:14 AM

బ్యాకింగ్‌ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువకానుంది. బ్యాంకు సేవలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల బ్యాంకర్ల సమితిలను(ఎ్‌సఎల్‌బీసీ) ఆదేశించింది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక శాఖ లేదా బ్యాంకింగ్‌ సేవా కేంద్రం, ఏటీఎం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు జారీచేసింది.

కొత్త బ్యాంకు శాఖలు వస్తున్నాయి

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బ్యాకింగ్‌ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువకానుంది. బ్యాంకు సేవలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల బ్యాంకర్ల సమితిలను(ఎ్‌సఎల్‌బీసీ) ఆదేశించింది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక శాఖ లేదా బ్యాంకింగ్‌ సేవా కేంద్రం, ఏటీఎం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ క్రమంలో జిల్లాలో బ్యాంకు సేవలు అవసరమైన గ్రామాల్ని గుర్తించి.. ఏర్పాటు చేసేందుకు జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రారంభంలో పుంగనూరులో వనమాలదిన్నెలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బట్టందొడ్డిలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు, పలమనేరులోని కొలమాసనపల్లెలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు శాఖలను తెరవబోతుంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 31 మండలాల పరిఽధిలో 275 బ్యాంకు బ్రాంచీలు, 415 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు, 293 ఏటీఎంలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు కేంద్రం ఆదేశాల మేరకు బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవా కేంద్రాలు, ఏటీఎం కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాల్ని గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్డీఎం హరీష్‌ మాట్లాడుతూ.. జిల్లాలో బ్యాంకింగ్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎస్‌ఎల్‌బీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నూతన బ్రాంచిలతోపాటు గ్రామాలు, పట్టణాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

Updated Date - Nov 14 , 2025 | 01:14 AM