తిరుపతి వేదికగా 8, 9 తేదీల్లో సహకార జాతీయ సదస్సు
ABN , Publish Date - Oct 02 , 2025 | 01:44 AM
సహకార రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ఈనెల 8, 9 తేదీల్లో తిరుపతిలోని హోటల్ తాజ్ వేదికగా జాతీయస్థాయి సదస్సు జరగనుంది.
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): సహకార రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ఈనెల 8, 9 తేదీల్లో తిరుపతిలోని హోటల్ తాజ్ వేదికగా జాతీయస్థాయి సదస్సు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిచ్చే ఈ సదస్సుకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశి్‌షకుమార్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిద్ధార్థజైన్‌తో పాటుసహాకార శాఖ కార్యదర్శులు, సహకార సంఘ రిజిస్ట్రార్లు, కేంద్రం, వివిధ రాష్ట్రాల్లోని సహకార రంగాలకు చెందిన అధికారులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నెల 7న డెలిగేట్లు తిరుపతికి చేరుకోనున్నారు. ఈ సదస్సు కోసం కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు.