తిరునగరిలో ‘కస్తూరి’ పరిమళం
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:20 AM
ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ జ్ఞాపకాలు తిరుపతిలో పదిలంగా ఉన్నాయి.
2022లో ఎస్వీయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆంధ్రజ్యోతి: ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరి రంగన్ జ్ఞాపకాలు తిరుపతిలో పదిలంగా ఉన్నాయి. ఇస్రోకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2022లో ఎస్వీయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ సందర్భంలో ఆయన ఉత్తేజపూరితంగా స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. అదే దశలో నూతన జాతీయ విద్యా విధానం-2020 చైర్మన్ హోదాలో ఆయన వ్యవహరించారు. అంతరిక్ష పరిశోధన రంగంలో కస్తూరి రంగన్‌లేని లోటు తీర్చలేనిదని ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సంపాతం తెలిపారు. మన దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు.