Share News

భార్యను హతమార్చి.. ఆత్మహత్య

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:06 AM

స్పర్థల నేపథ్యంలో భార్యను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. తిరుపతి రూరల్‌ మండలం మంగళం రిక్షా కాలనీలో శనివారం జరిగిన ఈ ఘటనతో పిల్లలు అనాథలయ్యారు. సీఐ సునీల్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. తిరుపతి రూరల్‌ బొమ్మల క్వార్టర్స్‌కు చెందిన ఉష(34)కు గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్‌తో 15 ఏళ్ళ క్రితం పెళ్లయింది. వీరికి తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు, ఏడవ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఉష కరకంబాడిలోని అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేసేది. లోకేశ్వర్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. కొంతకాలంగా ఈ దంపతుల మఽధ్య స్పర్దలు ఏర్పడ్డాయి. గొడవలతో ఆమె పలుసార్లు పుట్టింటికి వెళ్ళిపోయేది. ఇటీవల గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈక్రమంలోనే గత నెల 30న ఉష పుట్టింటికి వెళ్ళి పోయింది. లోకేశ్వర్‌ అక్కడే చిన్న గది అద్దెకు తీసుకుని ఉండేవాడు.

భార్యను హతమార్చి.. ఆత్మహత్య
హతురాలు ఉష - ఆత్మహత్య చేసుకున్న లోకేశ్వర్‌

  • దంపతుల విషాదాంతంతో అనాథలైన చిన్నారులు

తిరుపతి(నేరవిభాగం), జూలై 19(ఆంధ్రజ్యోతి): స్పర్థల నేపథ్యంలో భార్యను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. తిరుపతి రూరల్‌ మండలం మంగళం రిక్షా కాలనీలో శనివారం జరిగిన ఈ ఘటనతో పిల్లలు అనాథలయ్యారు. సీఐ సునీల్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. తిరుపతి రూరల్‌ బొమ్మల క్వార్టర్స్‌కు చెందిన ఉష(34)కు గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్‌తో 15 ఏళ్ళ క్రితం పెళ్లయింది. వీరికి తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు, ఏడవ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఉష కరకంబాడిలోని అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేసేది. లోకేశ్వర్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. కొంతకాలంగా ఈ దంపతుల మఽధ్య స్పర్దలు ఏర్పడ్డాయి. గొడవలతో ఆమె పలుసార్లు పుట్టింటికి వెళ్ళిపోయేది. ఇటీవల గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈక్రమంలోనే గత నెల 30న ఉష పుట్టింటికి వెళ్ళి పోయింది. లోకేశ్వర్‌ అక్కడే చిన్న గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఈనేపథ్యంలో అతను భార్యను హతమార్చాలని పథకం పన్నాడు. శనివారం ఉదయం 5 గంటలకు డ్యూటికి వెళ్లేందుకు కంపెనీ బస్సు కోసం వస్తున్న ఉషపై కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత లోకేశ్వర్‌ ఇంటికి వెళ్ళి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మిగలడం స్థానికులను కలచివేసింది. ఘటనా స్థలాన్ని అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి పరిశీలించారు. మృతదేహాలను రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 20 , 2025 | 01:09 AM