Share News

హత్యా? ఆత్మహత్యా?

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:35 AM

పరకామణిలో చోరీని పసిగట్టి ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి సతీ్‌షకుమార్‌ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనంగా మారింది. తిరుపతిలో సీఐడీ విచారణకు వచ్చే క్రమంలో తాడిపత్రి సమీపంలో రైలుపట్టాల పక్కన ఆయన మృతదేహం పడుంది.

హత్యా? ఆత్మహత్యా?
సతీ్‌షకుమార్‌ మృతదేహం

సంచలనంగా మారిన పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన సతీ్‌షకుమార్‌ మృతి

పరకామణిలో చోరీని పసిగట్టి ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి సతీ్‌షకుమార్‌ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనంగా మారింది. తిరుపతిలో సీఐడీ విచారణకు వచ్చే క్రమంలో తాడిపత్రి సమీపంలో రైలుపట్టాల పక్కన ఆయన మృతదేహం పడుంది. ఆయన మృతదేహం మీద ఉన్న గాయాలను బట్టి హత్య కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కేసు విచారణకు హాజరవుతున్న వారిలోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి. పరకామణి కేసులో రాజీచేసిన తీరును హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో మొదలైన సీఐడీ విచారణలో ఏ నిజాలు బయటపడతాయో అనే ఆందోళనతోనే సతీ్‌షకుమార్‌ను అంతమొందిచారా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మరణం రాజకీయ వివాదంగా మారుతోంది. హత్య అని కొందరూ, అనుమానమని మరికొందరూ, తమపై కుట్ర అని ఇంకొందరూ భిన్న వాదనలతో మీడియా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఒకసారి సతీ్‌షకుమార్‌ను సీఐడీ విచారించింది. మరోమారు విచారణకు ఆయన హాజరవుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం అనుమానాలకు బలం ఇస్తోంది. ఈ వార్త తెలియగానే సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆగమేఘాలపై సంఘటనస్థలికి ప్రయాణమయ్యారు.

Updated Date - Nov 15 , 2025 | 01:35 AM