ముక్కంటి హుండీ ఆదాయం రూ.2.20కోట్లు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:29 AM
శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.2,20,13,724 వచ్చింది
శ్రీకాళహస్తి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.2,20,13,724 వచ్చింది. ఆలయంలోని కొట్టు మండపం వద్ద లెక్కింపు చేపట్టారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీలను లెక్కించారు. బంగారం 59.100 గ్రాములు, వెండి 599 కిలోలు, విదేశీ కరెన్సీ 132 వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.