ఆర్ధికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో ఎంఎ్‌సఎంఈ కీలకం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:50 AM
నూతన సాంకేతికత, అవకాశాలను అందిపుచ్చుకోవాలి యువపారిశ్రామికవేత్తలకు మంత్రి కొండపల్లి పిలుపు
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) పాత్ర కీలకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాల్లో 90 శాతం.. ఉద్యోగాల్లో 70 శాతం వాటా వీటిదేనన్నారు. తిరుపతి సమీపం తాజ్ హోటల్‌లో శుక్రవారం జరిగిన ప్రపంచ ఎంఎ్‌సఎంఈ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. నూతన సాంకేతికతను, అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎ్‌సఎంఈలు మరింతగా ఎదగాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంఎ్‌సఎంఈ, సెర్ప్, ఎన్నారై శాఖలతో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. ‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామిక వేత్త’ దృష్టికోణంతో చంద్రబాబు ఎంఎ్‌సఎంఈలకు బ్యాంకు లింకేజీతోపాటు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక ఎంఎ్‌సఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇస్రో వంటి సంస్థల సమీపంలో అంతరిక్ష సంబంధిత ఎంఎ్‌సఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు సంస్థలనూ భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలన్నది సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ ఎస్పీ సోమనాద్ పేర్కొన్నారు. రానున్న నాలుగేళ్లలో ఎంఎ్‌సఎంఈలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్‌రావు అన్నారు. జిల్లాలో 1.80లక్షల మంది ఎంఎ్‌సఎంఈ రంగాలపై ఆధారపడి ఉన్నారని కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 186 యూనిట్ల లక్ష్యానికి 647 యూనిట్లను సాధించారన్నారు. తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం తదితరులు ప్రసంగించారు.
9 ఎంవోయులు
ఎంఎ్‌సఎంఈ దినోత్సవంలో వివిధ సంస్థలతో 9 ఎంవోయూలను కుదర్చుకన్నట్లు ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ విశ్వ తెలిపారు. నేషనల్ రీసెర్చ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, ఎంఎ్‌సఎంఈ టెక్నాలజీ సెంటర్(వైజాగ్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంఎ్‌సఎంఈ (హైదరాబాద్), ఎన్‌ఐడీ, ఎన్‌పీసీ, సీఎ్‌సటీ ఎంఎ్‌సఈ, ఎస్‌ఐడీబీఐ, ఎప్‌టీఈవో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారితో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. విశేష ప్రతిభ కనబరచిన ఎంఎ్‌సఎంఈలను, ఎన్‌ఎసీఈ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ అయ్యర్‌ను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, రాష్ట్ర గ్రీనరీ, బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, ఎంఎ్‌సఎంఈ ఈడీ సుదర్శన్‌బాబు, జిల్లా పరిశ్రమల జీఎం చంద్రశేఖర్, ఏపీఐఐసీ జడ్‌ఎం విజయభరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.