Share News

‘కొండ’పై భక్తులకు మరిన్ని ఉచిత బస్సులు

ABN , Publish Date - Jun 20 , 2025 | 01:48 AM

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను ట్యాక్సీ దోపిడీ నుంచి రక్షించేలా మరిన్ని ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో ప్రస్తుతం 10 శ్రీవారి ధర్మరథాలు(ఉచిత బస్సులు) అందుబాటులో ఉన్నాయి. ఇవి తిరుమలలోనే ఉంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తుంటాయి. ఇటీవల తిరుమలలోని ట్యాక్సీలు భక్తులను నుంచి అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్న క్రమంలో టీటీడీ ఓ నూతన ఆలోచన చేసింది. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా ఫ్రీ సర్వీసుకు వినియోగించాలని నిర్ణయించింది. దీనికి ఆర్టీసీ అధికారులు అంగీకారం తెలపడంతో తొలిదశలో గురువారం 80 ఆర్టీసీ బస్సులను ఉచిత రవాణాకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు ట్యాక్సీల ఛార్జీల భారం తగ్గించడంతో పాటు తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, వాహన శబ్ధ కాలుష్య నివారణకు ఈ విధానం ఉపయోగంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీలో ఉచిత ట్రిప్పులను గురువారం ప్రారంభించి.

‘కొండ’పై భక్తులకు మరిన్ని ఉచిత బస్సులు
బస్సులో ప్రయాణిస్తున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల, జూన్‌19(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను ట్యాక్సీ దోపిడీ నుంచి రక్షించేలా మరిన్ని ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో ప్రస్తుతం 10 శ్రీవారి ధర్మరథాలు(ఉచిత బస్సులు) అందుబాటులో ఉన్నాయి. ఇవి తిరుమలలోనే ఉంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తుంటాయి. ఇటీవల తిరుమలలోని ట్యాక్సీలు భక్తులను నుంచి అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్న క్రమంలో టీటీడీ ఓ నూతన ఆలోచన చేసింది. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా ఫ్రీ సర్వీసుకు వినియోగించాలని నిర్ణయించింది. దీనికి ఆర్టీసీ అధికారులు అంగీకారం తెలపడంతో తొలిదశలో గురువారం 80 ఆర్టీసీ బస్సులను ఉచిత రవాణాకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు ట్యాక్సీల ఛార్జీల భారం తగ్గించడంతో పాటు తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, వాహన శబ్ధ కాలుష్య నివారణకు ఈ విధానం ఉపయోగంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీలో ఉచిత ట్రిప్పులను గురువారం ప్రారంభించి.. ఆ బస్సులో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆర్టీసీ ఈడీ చంద్రశేఖర్‌, టీటీడీ రవాణా జీఎం శేషారెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటరావు, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, డిపో మేనేజర్‌ శ్రీహరి తదితరులు కొంతదూరం ప్రయాణించారు.

ఏయే ప్రాంతాల్లో తిరుగుతాయంటే..

తిరుపతి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు తొలుత తిరుమలలోని బాలాజీ బస్టాండ్‌కు చేరుకుంటాయి. అక్కడ ప్రయాణికులు దిగాక.. అదే బస్సు శ్రీవారి ధర్మరథాలు తిరిగే రూట్‌లోకి ప్రవేశిస్తుంది. శంఖుమిట్ట(ఎ్‌సఎంసీ), వైకుంఠం 1, ఎస్వీ గెస్ట్‌హౌస్‌, కృష్ణతేజ సర్కెల్‌, వైకుంఠం 2, ఎస్వీ మ్యూజియం, మఠాలు, వరాహస్వామి విశ్రాంతి గృహాలు, నందకం, రాంభగీచ, లేపాక్షి సర్కిల్‌, సీఆర్వో కార్యాలయం మీదుగా తిరిగి జీఎన్సీ టోల్‌గేట్‌కు చేరుకుంటుంది. తిరుపతి నుంచి వచ్చే భక్తులు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా దిగచ్చు. ఈ ప్రాంతాల్లో ఎక్కే ప్రయాణికులు జీఎన్సీ టోల్‌గేట్‌ వరకు తమకు కావాల్సిన ప్రాంతాల్లో దిగచ్చు. జీఎన్సీ తర్వాత తిరుపతి వెళ్లే భక్తులు మాత్రమే టికెట్‌ కొనాలి. తిరుపతికి వెళ్లే భక్తులకు వరాహస్వామి విశ్రాంతి గృహాల వద్ద టికెట్లు విక్రయించే కౌంటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అవసరానికి అనుగుణంగా ఈ బస్సుల సంఖ్యను 150 వరకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 01:48 AM