మీపై మనీల్యాండరింగ్ కేసు
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:49 AM
‘మేము ముంబై సీబీఐ అధికారులం. మీపై రూ.583 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో మీ పేరుంది. వాట్సాప్ కాల్ ద్వారా మిమ్మల్ని విచారిస్తున్నాం’ అంటూ డిజిటల్ అరెస్టు పేరిట భయపెట్టారు దీన్నుంచి బయట పడాలంటే రూ.80 లక్షలు పంపాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా తిరుపతిలోని 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ నుంచి వివిధ ఖాతాలకు నగదు వేయించుకున్న ఎనిమిది మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరి జాయింట్ అకౌంటులోని దాదాపు రూ.2.5 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. డిజిటల్ అరెస్టుకు భయపడిన తిరుపతివాసి నుంచి రూ.80 లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మ్యూల్ ఖాతాల్లోకి సైబర్ నేరగాళ్లు జమ చేసుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు తిరుపతి ఈస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో డీఎస్పీ భక్తవత్సలం స్వీయ పర్యవేక్షణలో ఎస్‌ఐలు, సిబ్బంది ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి నిందితుల కోసం గాలించారు. చివరికి డబ్బులు చేరింది ఎక్కడికంటే.. బాధితుడి అకౌంటు నుంచి రెండు మ్యూల్ అకౌంట్లకు నగదు జమ చేయించారు. ఆ మ్యూల్ ఖాతాల నుంచి 14 రాష్ట్రాల్లోని ఇతర అకౌంట్లకు ఆ మొత్తం చేరింది. చివరికి.. గేమింగ్ యాప్ వినియోగదారులకు ఆ మొత్తం చేరినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రధాన నిందితుడు కోటి బాబుకు టెలిగ్రామ్ ద్వారా హరియాణాలోని డానియల్, చైనాకు చెందిన టియాన్, ఇంకా డీ పేర్లతో ఉన్న విదేశీ నెట్‌వర్కులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది జనవరిలో కోటి బాబు కంబోడియాకు వెళ్లి 24 రోజుల పాటు సైబర్ నేరగాళ్లతో కలిసి పనిచేసి తిరిగి హైదరాబాదుకు వచ్చాడు. ఇక, క్రాంతి కుమార్, పవన్ కుమార్ కలిసి తప్పుడు పత్రాలతో డీకేకే ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ పేరిట జాయింట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆ ఖాతాలోకి రూ.30 లక్షలు జమకాగా.. ఆ తర్వాత విదేశీ సైబర్ నెట్‌వర్క్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు నిర్ధారించారు. మరికొన్ని కేసుల్లోనూ ఈ ఖాతాను వినియోగించినట్లు బయటపడింది. వాటిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. అదనంగా, ఈ అకౌంట్ తెరవడంలో సంబంధిత బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయం ఉందా అనేది దానిపైనా విచారిస్తున్నారు. అరెస్టయింది 8 మంది వీరే దండే క్రాంతికుమార్, నిమ్మల పవన్‌కుమార్ (అనంతపురం), మానే కోటిబాబు, గుండవేని గౌతమ్ (హైదరాబాదు), పరపాల శ్రీనివాస్ (రాజమండ్రి), ఎం.చంద్రశేఖర్, శివశంకర్, నగారిధన్ ప్రశాంత రెడ్డి (బళ్లారి) అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇక, కీలక నిందితుడు హైదరాబాదులోని యూస్‌ఫగూడకు చెందిన మొహమూద్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
సీబీఐ అంటూ సీనియర్ సిటిజన్‌కు వాట్సాప్ కాల్
డిజిటల్ అరెస్టు పేరిట రూ.80 లక్షల వసూలు
తిరుపతిలో ఎనిమిది మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘మేము ముంబై సీబీఐ అధికారులం. మీపై రూ.583 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో మీ పేరుంది. వాట్సాప్ కాల్ ద్వారా మిమ్మల్ని విచారిస్తున్నాం’ అంటూ డిజిటల్ అరెస్టు పేరిట భయపెట్టారు దీన్నుంచి బయట పడాలంటే రూ.80 లక్షలు పంపాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా తిరుపతిలోని 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ నుంచి వివిధ ఖాతాలకు నగదు వేయించుకున్న ఎనిమిది మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరి జాయింట్ అకౌంటులోని దాదాపు రూ.2.5 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. డిజిటల్ అరెస్టుకు భయపడిన తిరుపతివాసి నుంచి రూ.80 లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మ్యూల్ ఖాతాల్లోకి సైబర్ నేరగాళ్లు జమ చేసుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు తిరుపతి ఈస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో డీఎస్పీ భక్తవత్సలం స్వీయ పర్యవేక్షణలో ఎస్‌ఐలు, సిబ్బంది ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి నిందితుల కోసం గాలించారు.
చివరికి డబ్బులు చేరింది ఎక్కడికంటే..
బాధితుడి అకౌంటు నుంచి రెండు మ్యూల్ అకౌంట్లకు నగదు జమ చేయించారు. ఆ మ్యూల్ ఖాతాల నుంచి 14 రాష్ట్రాల్లోని ఇతర అకౌంట్లకు ఆ మొత్తం చేరింది. చివరికి.. గేమింగ్ యాప్ వినియోగదారులకు ఆ మొత్తం చేరినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రధాన నిందితుడు కోటి బాబుకు టెలిగ్రామ్ ద్వారా హరియాణాలోని డానియల్, చైనాకు చెందిన టియాన్, ఇంకా డీ పేర్లతో ఉన్న విదేశీ నెట్‌వర్కులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది జనవరిలో కోటి బాబు కంబోడియాకు వెళ్లి 24 రోజుల పాటు సైబర్ నేరగాళ్లతో కలిసి పనిచేసి తిరిగి హైదరాబాదుకు వచ్చాడు. ఇక, క్రాంతి కుమార్, పవన్ కుమార్ కలిసి తప్పుడు పత్రాలతో డీకేకే ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ పేరిట జాయింట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆ ఖాతాలోకి రూ.30 లక్షలు జమకాగా.. ఆ తర్వాత విదేశీ సైబర్ నెట్‌వర్క్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు నిర్ధారించారు. మరికొన్ని కేసుల్లోనూ ఈ ఖాతాను వినియోగించినట్లు బయటపడింది. వాటిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. అదనంగా, ఈ అకౌంట్ తెరవడంలో సంబంధిత బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయం ఉందా అనేది దానిపైనా విచారిస్తున్నారు.
అరెస్టయింది 8 మంది వీరే
దండే క్రాంతికుమార్, నిమ్మల పవన్‌కుమార్ (అనంతపురం), మానే కోటిబాబు, గుండవేని గౌతమ్ (హైదరాబాదు), పరపాల శ్రీనివాస్ (రాజమండ్రి), ఎం.చంద్రశేఖర్, శివశంకర్, నగారిధన్ ప్రశాంత రెడ్డి (బళ్లారి) అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇక, కీలక నిందితుడు హైదరాబాదులోని యూస్‌ఫగూడకు చెందిన మొహమూద్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
అలాంటి వారితో జాగ్రత్త
‘నీ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే కమీషన్ ఇస్తాం. కేవైసీ పంపు. నెలవారీ ఆదాయం వస్తుంది. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే జీతం వస్తుంది’ అని ఎవరైనా చెప్పారంటే.. వాళ్లు సైబర్ నేరగాళ్లే. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలంటూ ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. డిజిటల్ అరెస్టుల పేరిట ఎవరైనా బెదిరిస్తే 112 లేదా సైబర్ క్రైం టోల్ ఫ్రీ నెంబరు 1930 కు ఫోనుచేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, సీఐలు శ్రీనివాసులు, వినోద్‌కుమార్, ఎస్‌ఐలు హేమాద్రి, నాగార్జున రెడ్డి, లోకే్‌షకుమార్‌ను ఎస్పీ అభినందించారు.