అమ్మా.. నువ్వు లేక!
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:35 AM
ఆ గున్న ఏనుగుకు 40 రోజులుగా అమ్మ ఆలనా పాలన దూరమైంది. మందలో తిరుగుతున్నా ఒంటరే అయింది. అమ్మ పాలు లేక.. ఆహారం సరిగా అందక మరణించింది. గున్న ఏనుగు కళేబరాన్ని పది రోజుల తర్వాత గుర్తించిన అటవీశాఖ అధికారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పులిచెర్ల మండలంలోని పాతపేట పంచాయతీ చిట్టారెడ్డిపేట సమీపంలో జూలై ఐదో తేదీ రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఓ తల్లి ఏనుగు ప్రమాదవశాత్తూ మృతి చెందింది. ఈ ఏనుగు అప్పటికే ఓ గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. దానికి నెల వయసు ఉంటుంది. తల్లి చనిపోయాక మిగిలిన ఏనుగులతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి దానికి తల్లి పాలు లేకపోవడం, ఆహారం సరిగా అందలేదు. తల్లి ఏనుగుపై బెంగ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పది రోజుల కిందట పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ సరిహద్దులోని సైదుల్లా గుట్ట అటవీ ప్రాంతంలో మృతి చెందింది. అటవీ ప్రాంతం కావడంతో ఎవరూ గుర్తించలేదు. అడవిలో గొర్రెలు మేపుతున్న కాపరులు శనివారం సాయంత్రం గున్న ఏనుగు కళేబరాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం తిరుపతి డీఎ్‌ఫవో వివేక్, ఎఫ్‌ఆర్‌వో మాధవి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, కళేబరాన్ని పరిశీలించారు. తిరుపతి జూపార్కు వైద్యులు తోహిబాసింగ్ ఆధ్వర్యంలో గున్న ఏనుగు కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే దహనం చేశారు. ఈ సందర్భంగా డీఎ్‌ఫవో వివేక్ మాట్లాడుతూ.. తల్లి పాలు లేకపోవడం, ఆహారం సరిగా అందకపోవడంతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతాయని చెప్పారు. ఎఫ్‌ఎ్‌సవో భారతి, ఎఫ్‌బీవో జమున, ట్రాకర్స్ పాల్గొన్నారు.
‘తల్లి’డిల్లుతూ మృతిచెందిన గున్న ఏనుగు
పది రోజుల తర్వాత కళేబరం గుర్తింపు
కల్లూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆ గున్న ఏనుగుకు 40 రోజులుగా అమ్మ ఆలనా పాలన దూరమైంది. మందలో తిరుగుతున్నా ఒంటరే అయింది. అమ్మ పాలు లేక.. ఆహారం సరిగా అందక మరణించింది. గున్న ఏనుగు కళేబరాన్ని పది రోజుల తర్వాత గుర్తించిన అటవీశాఖ అధికారులు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పులిచెర్ల మండలంలోని పాతపేట పంచాయతీ చిట్టారెడ్డిపేట సమీపంలో జూలై ఐదో తేదీ రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఓ తల్లి ఏనుగు ప్రమాదవశాత్తూ మృతి చెందింది. ఈ ఏనుగు అప్పటికే ఓ గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. దానికి నెల వయసు ఉంటుంది. తల్లి చనిపోయాక మిగిలిన ఏనుగులతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి దానికి తల్లి పాలు లేకపోవడం, ఆహారం సరిగా అందలేదు. తల్లి ఏనుగుపై బెంగ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పది రోజుల కిందట పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ సరిహద్దులోని సైదుల్లా గుట్ట అటవీ ప్రాంతంలో మృతి చెందింది. అటవీ ప్రాంతం కావడంతో ఎవరూ గుర్తించలేదు. అడవిలో గొర్రెలు మేపుతున్న కాపరులు శనివారం సాయంత్రం గున్న ఏనుగు కళేబరాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం తిరుపతి డీఎ్‌ఫవో వివేక్, ఎఫ్‌ఆర్‌వో మాధవి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, కళేబరాన్ని పరిశీలించారు. తిరుపతి జూపార్కు వైద్యులు తోహిబాసింగ్ ఆధ్వర్యంలో గున్న ఏనుగు కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడే దహనం చేశారు. ఈ సందర్భంగా డీఎ్‌ఫవో వివేక్ మాట్లాడుతూ.. తల్లి పాలు లేకపోవడం, ఆహారం సరిగా అందకపోవడంతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతాయని చెప్పారు. ఎఫ్‌ఎ్‌సవో భారతి, ఎఫ్‌బీవో జమున, ట్రాకర్స్ పాల్గొన్నారు.