Share News

బూందీపోటులో ఆధునిక యంత్రాలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:34 PM

తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు వినియోగించే బూందీ తయారీ కోసం మరో 10 వేల లీటర్ల థర్మిక్‌ ఎక్ర్టాక్షన్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు.

బూందీపోటులో ఆధునిక యంత్రాలు

తిరుమల, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): తిరుమలలో లడ్డూ ప్రసాదాలకు వినియోగించే బూందీ తయారీ కోసం మరో 10 వేల లీటర్ల థర్మిక్‌ ఎక్ర్టాక్షన్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. కోటిన్నర వ్యయంతో పనులు సాగుతున్నాయి. పోటులో అగ్నిప్రమాదాలకు అవకాశం లేకుండా ఽథర్మో ఫ్లూయిడ్‌ కడాయ్‌ సిస్టమ్‌తో కూడి బూందీ తయారీ కేంద్రాన్ని రూ.10కోట్లతో 2020లో ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే) సంస్థ విరాళంగా ఈ మొత్తాన్ని సమకూర్చింది. ఈ వ్యవస్థకు థర్మిక్‌ ఆయిల్‌ సరఫరా చేసే 10 వేల లీటర్ల సామర్థ్యంగల థర్మిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. మరింత బూందీ తయారీకి అదనంగా 10 వేల లీటర్ల ఽథర్మిక్‌ ట్యాంక్‌ అవసరమని టీటీడీ భావించడంతో సీఎ్‌సకే అధినేత శ్రీనివాస్‌ దీని ఏర్పాటుకు ముందుకొచ్చారు. ప్రస్తుతమున్న ఎంఎ్‌స(మైల్డ్‌ స్టీల్‌) పైప్‌ లైన్‌ను తొలగించి దీని స్థానంలో ఎస్‌ఎస్‌ (స్టెయిన్‌లె్‌స స్టీల్‌) పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బూందీ పిండి, చక్కెర పాకం నేరుగా కడాయిల్లోకి చేరేలా పైప్‌లైన్‌ సిస్టమ్‌, అధునాత కన్వేయర్‌బెల్ట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వటికి దాదాపు రూ.5 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా శ్రీనివాసన్‌ అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. వీటికి సంబంధించి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సీఎ్‌సకే సీఈవో, ఎండీ విశ్వనాథన్‌, టెక్నికల్‌ కన్సల్టెంట్‌ శంకర్‌, రఘునాథన్‌ బుధవారం చర్చించారు. స్వామి లడ్డూప్రసాదం తయారీలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని విశ్వనాథన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:34 PM