Share News

అగ్నిమాపక కేంద్రాల్లో ఆధునిక పరికరాలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:21 AM

అగ్నిమాపక కేంద్రాలకు ఆధునిక పరికరాలు రానున్నాయని రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఎ్‌ఫవో) భూపాల్‌ రెడ్డి చెప్పారు. జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల తనిఖీల్లో భాగంగా ఆయన బుధవారం జిల్లాకొచ్చారు.

అగ్నిమాపక కేంద్రాల్లో ఆధునిక పరికరాలు
డీఎ్‌ఫవోతో మాట్లాడుతున్న ఆర్‌ఎ్‌ఫవో భూపాల్‌ రెడ్డి

ఆర్‌ఎ్‌ఫవో భూపాల్‌ రెడ్డి

చిత్తూరు సిటీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక కేంద్రాలకు ఆధునిక పరికరాలు రానున్నాయని రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఎ్‌ఫవో) భూపాల్‌ రెడ్డి చెప్పారు. జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల తనిఖీల్లో భాగంగా ఆయన బుధవారం జిల్లాకొచ్చారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ములకలచెరువు, పాకాలలో నూతన అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.2.25 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. వాయల్పాడులో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ.15లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వెదురుకుప్పం, సదుంలో నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉందని.. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. డీఎ్‌ఫవో పెద్దిరెడ్డి, ఏడీఎ్‌ఫవో కరుణాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 01:21 AM