రైల్వే స్టేషన్‌లో మాక్ డ్రిల్
ABN , Publish Date - May 12 , 2025 | 01:48 AM
రైల్వే స్టేషన్‌లో ఉగ్ర ముప్పు నుంచి ప్రయాణికులు తమను తాము ఎలా రక్షించుకోవాలి? ఉగ్రవాదులు చొరబడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విపత్కర పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలపై ఆదివారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
తిరుపతి(నేరవిభాగం/సెంట్రల్), మే 11 (ఆంధ్రజ్యోతి): రైల్వే స్టేషన్‌లో ఉగ్ర ముప్పు నుంచి ప్రయాణికులు తమను తాము ఎలా రక్షించుకోవాలి? ఉగ్రవాదులు చొరబడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విపత్కర పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలపై ఆదివారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే సీఐ ఆశీర్వాదం నేతృత్వంలో పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో తిరుపతి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈ మాక్‌డ్రిల్ సాగింది. రైల్వే హెల్త్ యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీమ్‌లు చేపట్టాల్సిన అంశాలను సందీప్ కుమార్, ఆశీర్వాదం వివరించారు. కార్యక్రమంలో ఎన్‌వి రమణ, పోతురాజు, సుబ్బరాజు, రాంబాబు, ధర్మేంద్ర రాజు, ఖాశీం, నదియా, మల్లిక తదితరులు పాల్గొన్నారు.