Share News

తిరుపతి జిల్లా స్థాయిలో మాక్‌ అసెంబ్లీ

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:20 AM

తిరుపతిలోని తుడా కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మాక్‌ అసెంబ్లీ పోటీల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేశారు. అందులో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా స్థాయిలో మాక్‌ అసెంబ్లీ
విద్యార్థులను అభినందిస్తున్న ఇన్‌చార్జి జేసీ మౌర్య

తిరుపతి/తిరుపతి (విద్య), నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని తుడా కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మాక్‌ అసెంబ్లీ పోటీల్లో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేశారు. అందులో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్నారు. మిగిలిన ఇద్దరు విజేతలకు జిల్లా స్థాయిలో మెడల్స్‌, ప్రశంసాపత్రాలు అందజేశారు. విజేతలుగా గూడూరు నియోజకవర్గం నుంచి పి.స్పందన (మల్లం), వై.నైనిక (వరగళి).. బద్న (సూళ్లూరుపేట), కె.రాజశేఖర్‌ (ఎల్‌ఏ సాగరం), ఎం.తనుజ భార్గవి (వెంకటగిరి), ఎం.మునిచరణ్‌ (పనపాకం), అమాస తేజస్విని (చంద్రగిరి), పట్టం ధనుష్‌ (తిరుపతి), గౌతమ్‌ నవీన్‌ (తంబువాని గుంట), సంగీతం జ్ఞానిక, గుమ్మడి పూజశ్రీ (శ్రీకాళహస్తి), ఎం. కౌశిత (ఇరుగులం), జె. ఇషాంత్‌ (కల్లివెట్టు) ఎంపికయ్యారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ భారతరాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని ఇన్‌చార్జి జేసీ, కమిషనర్‌ ఎన్‌.మౌర్య సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో స్టేజ్‌ ఫియర్‌ తగ్గి, మాట్లాడే నైపుణ్యాలు పెరుగుతాయని డీఈవో కుమార్‌ తెలిపారు. రాజ్యాంగ విలువలను తెలుసుకోవడం ప్రతి విద్యార్థికి అవసరమని ఏపీసీ గౌరీ శంకర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎంవో జి.సురేష్‌, ఏఎన్‌వో చంద్రశేఖర్‌ నాయుడు, ఏపీవో సుధాకర్‌ నాయుడు, ఇతర అదికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 01:20 AM