Share News

సీఎం జలహారతి ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:02 AM

మొక్కవోని సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం నుంచి తీసుకువచ్చిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనీవా కాలువ వద్ద శనివారం జలహారతి ఇవ్వనున్నారు. కుప్పం మండలం పరమసముద్రం చెరువుతోపాటు సమీపంలోని కాలువ వద్ద ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీర్లతో కలిసి శుక్రవారం పర్యవేక్షించారు.

సీఎం జలహారతి ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల
సీఎంచం చం చంద్రబాబు పాల్గొనే సభా ప్రాంగణంలో ఏర్పాట్లు

కుప్పం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మొక్కవోని సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం నుంచి తీసుకువచ్చిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనీవా కాలువ వద్ద శనివారం జలహారతి ఇవ్వనున్నారు. కుప్పం మండలం పరమసముద్రం చెరువుతోపాటు సమీపంలోని కాలువ వద్ద ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీర్లతో కలిసి శుక్రవారం పర్యవేక్షించారు. జలహారతి ఇవ్వనున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలోకి మెట్లు నిర్మించడమేకాక, రెయిలింగ్‌ అమర్చి సుందరంగా తయారు చేశారు.ఈ కాలువ ఒడ్డునే ఆవిష్కరించనున్న పైలాన్‌ నిర్మాణం కూడా పూర్తయింది. పరమసముద్రం చెరువుకు మరోవైపు సీఎం పాల్గొననున్న బహిరంగ సభా వేదిక నిర్మించారు. నియోజకవర్గంలోని అన్నదాతలు, ఇతర ప్రజలను ఉద్దేశించి ఈ సభావేదికనుంచి చంద్రబాబు ప్రసంగిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శనివారం సాయంత్రం సీఎం తిరుగు ప్రయాణానికి అవసరమైన హెలిప్యాడ్‌ను సైతం పరమసముద్రం గ్రామ సమీపంలోనే నిర్మించారు.మంత్రి రామానాయుడు శుక్రవారం మధ్యాహ్నానికి కుప్పం చేరుకుని పరమ సముద్రం చెరువు, హంద్రీనీవా కాలువను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంతం, హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హంద్రీ-నీవా కాలువలో నీటి ప్రవాహం, చెరువుకు చేరుతున్న నీటి పరిమాణం తదితర అంశాల గురించి హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ఇంజనీర్లతో చర్చించారు.

సీఎం పర్యటన ఇలా....

10.30 ఏఎం - పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనీవా కాలువ నిర్మాణం పూర్తయిన గుర్తుగా పైలాన్‌ ఆవిష్కరణ

11.15 ఏఎం - హంద్రీనీవా కాలువలో జలహారతి

11.20 ఏఎం - 11.50 ఏఎం -బహిరంగ సభ, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఎంవోయూలపై సంతకం

11.50 ఏఎం - 01.20 పీఎం - ప్రజలనుద్దేశించి ప్రసంగం

02.00 పీఎం - 03.45 పీఎం - వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ఇతర ముఖ్యులతో సమావేశం

03.50 పీఎం - పరమసముద్రం హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగుపయనం

Updated Date - Aug 30 , 2025 | 01:02 AM