రేపు మంత్రి లోకేశ్ పర్యటన
ABN , Publish Date - May 06 , 2025 | 12:59 AM
రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(కలెక్టరేట్), మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంబై విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం బయలుదేరి 3.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారని, రోడ్డు మార్గాన 5.10 గంటలకు సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాత్రి అక్కడే బసచేసి గురువారం ఉదయం 10.50 గంటలకు శ్రీసిటీ చేరుకుని ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం రోడ్డు మార్గాన 2.30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని 2.40గంటలకు హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు కలెక్టర్ వివరించారు.