Share News

డివిజన్‌ స్థాయిలో మినీ కలెక్టరేట్లు

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:46 AM

పంచాయతీరాజ్‌ సంస్కరణల్లో భాగంగా కూటమి ప్రభుత్వం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీడీవో)లకు విశేష అధికారాలను అప్పగించింది. డీడీవోల జాబ్‌చార్ట్‌ను మారుస్తూ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. డివిజన్‌ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే పరిపాలన నియంత్రణలోకి తీసుకురానున్నారు. డివిజన్‌ స్థాయిలో ఉన్న పంచాయతీ ఆఫీసు (డీఎల్‌పీవో), డ్వామా ఏపీడీ, ఇతర శాఖల డివిజనల్‌ కార్యాలయాలను డీడీవో కార్యాలయాల సముదాయంలోకి మారుస్తున్నారు. డివిజన్‌ స్థాయిలో ఈ డీడీవో కార్యాలయాలు మినీ కలెక్టరేట్లుగా ప్రజలకు సేవలందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. డీడీవోల బాధ్యతలు డివిజన్‌ స్థాయిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగాలను డీడీవో నియంత్రిస్తారు. డివిజన్‌ స్థాయిలో అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ సమీక్షలు నిర్వహిస్తారు. పాలనాపరంగా ప్రతి నెలా కనీసం 20 రోజులు పర్యటించి టూర్‌ డైరీలను కలెక్టర్లకు సమర్పించాల్సి వుంటుంది. ఎంపీడీవోలతో పాటు డివిజన్‌ స్థాయిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బంది మొత్తం డీడీవో నియంత్రణలో పని చేస్తారు. ఆరు నెలలకోసారి మండల పరిషత్‌ కార్యాలయాలను డీడీవో తనిఖీ చేస్తారు. స్థానిక ఎన్నికల బాధ్యత

డివిజన్‌ స్థాయిలో మినీ కలెక్టరేట్లు

  • పంచాయతీరాజ్‌లో కీలక సంస్కరణలు

  • డివిజన్‌ స్థాయిలో ఒకే గొడుగు కిందకు పీఆర్‌, ఆర్డీ

  • నేడు చిత్తూరు డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌

చిత్తూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ సంస్కరణల్లో భాగంగా కూటమి ప్రభుత్వం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీడీవో)లకు విశేష అధికారాలను అప్పగించింది. డీడీవోల జాబ్‌చార్ట్‌ను మారుస్తూ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. డివిజన్‌ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే పరిపాలన నియంత్రణలోకి తీసుకురానున్నారు. డివిజన్‌ స్థాయిలో ఉన్న పంచాయతీ ఆఫీసు (డీఎల్‌పీవో), డ్వామా ఏపీడీ, ఇతర శాఖల డివిజనల్‌ కార్యాలయాలను డీడీవో కార్యాలయాల సముదాయంలోకి మారుస్తున్నారు. డివిజన్‌ స్థాయిలో ఈ డీడీవో కార్యాలయాలు మినీ కలెక్టరేట్లుగా ప్రజలకు సేవలందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

డీడీవోల బాధ్యతలు

డివిజన్‌ స్థాయిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగాలను డీడీవో నియంత్రిస్తారు. డివిజన్‌ స్థాయిలో అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ సమీక్షలు నిర్వహిస్తారు. పాలనాపరంగా ప్రతి నెలా కనీసం 20 రోజులు పర్యటించి టూర్‌ డైరీలను కలెక్టర్లకు సమర్పించాల్సి వుంటుంది. ఎంపీడీవోలతో పాటు డివిజన్‌ స్థాయిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బంది మొత్తం డీడీవో నియంత్రణలో పని చేస్తారు. ఆరు నెలలకోసారి మండల పరిషత్‌ కార్యాలయాలను డీడీవో తనిఖీ చేస్తారు.

స్థానిక ఎన్నికల బాధ్యత

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటివరకు డిప్యూటీ డిస్ర్టిక్‌ ఎలక్షన్‌ అథారిటీగా ఆర్డీవోలు ఉండేవారు. ఇక నుంచి డీడీవోలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్‌ రూల్స్‌ను సవరించనున్నారు.నిజానికి వైసీపీ హయాంలో పెద్దఎత్తున ఎంపీడీవోలను డీడీవోలుగా ప్రమోట్‌ చేశారు.అయితే ఒక్కరికీ సరైన పోస్టింగు ఇవ్వలేదు. అందరికీ ఎంపీడీవో స్థాయి కంటే చిన్నదైన డ్వామా ఏపీడీగా పోస్టింగు ఇచ్చారు. ఆయా డివిజన్‌ కేంద్రాల్లో ఉన్న ఎంపీడీవో కార్యాలయాల్లోనే డీడీవోలకు ఓ ఛాంబర్‌ కేటాయించారు. మొత్తానికి డీడీవో వ్యవస్థ వైసీపీ హయాంలో సర్వేలు, నామమాత్రపు పర్యవేక్షణకే పరిమితమైంది.

చిత్తూరు కేంద్రంగా 77 కార్యాలయాల ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ప్రారంభించనుంది. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ చిత్తూరు నుంచి వర్చువల్‌గా వీటిని ప్రారంభించనున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 01:46 AM