Share News

నేడు పాఠశాలల్లో మెగా పీటీఎం 3.0

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:38 AM

జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో శుక్రవారం మెగా పీటీఎం (మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌) 3.0 జరగనుంది. జిల్లా సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

నేడు పాఠశాలల్లో మెగా పీటీఎం 3.0

2513 ప్రభుత్వ విద్యాసంస్థల్లో పాల్గొననున్న 4,30,897 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు

తిరుపతి(విద్య), డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో శుక్రవారం మెగా పీటీఎం (మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌) 3.0 జరగనుంది. జిల్లా సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 2,323 పాఠశాలల్లో 3,68,422 మంది, 195 జూనియర్‌ కళాశాలల్లో 62,475 మంది చొప్పున 4,30,897 మంది విద్యార్థులు, వారు తల్లిదండ్రులు మెగా పీటీఎం సమావేశాలకు హాజరుకానున్నారు. డీఈవో కేవీఎన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పాఠశాలల్లోను, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జూనియర్‌ కళాశాలల్లోను ఏర్పాటు సాగుతున్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం పాఠశాలలకు రూ.44,93,250, కళాశాలలకు రూ.15 లక్షలు చొప్పున రూ.59,93,250 విడుదలచేసింది. విద్యార్థుల సంఖ్యనుబట్టి ఆయా పాఠశాలలకు, కళాశాలలకు నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా పేరెంట్స్‌కు క్రీడా పోటీలు, విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పిల్లల చదువు, నడవడిక, ప్రగతి గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించి, హోలిస్టిక్‌ ప్రొగ్రెస్‌ కార్డులు అందించనున్నారు.

Updated Date - Dec 05 , 2025 | 01:38 AM