వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలపై 6న ఉభయదారులతో సమావేశం
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:50 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈనెల ఆరో తేదీన ఉభయదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మణికంఠేశ్వరస్వామి ఆలయంలో జరిగే సమావేశానికి 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు హాజరుకావాలని కోరారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై తమ సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఆగస్టు 27వ తేదీనుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. నేడు ఆలయ హుండీ లెక్కింపు: వరసిద్ధుడి ఆలయ హుండీని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. లెక్కింపు సందర్భంగా ఆలయ ఉద్యోగులు ఎవ్వరు సెలవు పెట్టరాదన్నారు.
ఐరాల(కాణిపాకం), జూలై 3 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈనెల ఆరో తేదీన ఉభయదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మణికంఠేశ్వరస్వామి ఆలయంలో జరిగే సమావేశానికి 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు హాజరుకావాలని కోరారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై తమ సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఆగస్టు 27వ తేదీనుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.
నేడు ఆలయ హుండీ లెక్కింపు: వరసిద్ధుడి ఆలయ హుండీని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. లెక్కింపు సందర్భంగా ఆలయ ఉద్యోగులు ఎవ్వరు సెలవు పెట్టరాదన్నారు.