Share News

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు రేపటినుంచి వైద్య పరీక్షలు

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:59 AM

జిల్లాలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నుంచి ఈనెల ఏడో తేదీవరకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు రేపటినుంచి వైద్య పరీక్షలు

చిత్తూరు అర్బన్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నుంచి ఈనెల ఏడో తేదీవరకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో ఉదయం ఆరు గంటలకు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌ పక్కనే ఉన్న పాత పోలీసు కార్యాలయం వద్దకు చేరుకోవాలన్నారు.

రిజిస్ర్టేషన్‌ నెంబర్ల వారీగా..

మహిళా విభాగం (సివిల్‌): మంగళవారం 4002466 నుంచి 4152206 వరకు ఫ బుధవారం 4155558 నుంచి 4481787 వరకు, ఫ పురుష విభాగంలో.. (సివిల్‌, ఏపీపీఎస్సీ): 4న 4004185నుంచి 4093554 వరకు, 5న 409465 నుంచి4174863 వరకు, 6న 4179694 నుంచి 4252641 వరకు, 7న 4254681 నుంచి 4504895 వరకు వైద్య పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు హాల్‌ టికెట్‌, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను తీసుకురావాలి.

Updated Date - Sep 01 , 2025 | 01:59 AM