భారీగా ఎస్‌ఐల బదిలీలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:41 AM
జిల్లాలో పెద్ద సంఖ్యలో ఎస్‌ఐలను బదిలీ చేశారు. దీర్ఘకాలికంగా పనిచేయడం, ప్రజాప్రతినిధులతో చిన్నపాటి విభేదాలు, జిల్లాకు కొత్తగా తొమ్మిది మంది రావడం వంటి కారణాలతో ఎస్పీ తుషార్ డూడీ ఎస్‌ఐల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 21 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
21మందికి స్థాన చలనం
చిత్తూరు అర్బన్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెద్ద సంఖ్యలో ఎస్‌ఐలను బదిలీ చేశారు. దీర్ఘకాలికంగా పనిచేయడం, ప్రజాప్రతినిధులతో చిన్నపాటి విభేదాలు, జిల్లాకు కొత్తగా తొమ్మిది మంది రావడం వంటి కారణాలతో ఎస్పీ తుషార్ డూడీ ఎస్‌ఐల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 21 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తొమ్మిది మంది ప్రొబేషనరీ ఎస్‌ఐల బదిలీ
జిల్లాలో శిక్షణ తీసుకుని కొత్తగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న తొమ్మిది మంది ఎస్‌ఐలకు పోస్టింగ్స్ ఇచ్చారు. పుంగనూరు రూరల్‌లో శిక్షణ తీసుకున్న మణికంఠేశ్వరరెడ్డిని ఎన్‌ఆర్‌పేట పీఎ్‌సకు, చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్‌లో శిక్షణ తీసుకున్న కె.బి.చందనప్రియను బైరెడ్డిపల్లెకు, కల్లూరులో శిక్షణ తీసుకున్న కె.మధుసూదన్‌ను రొంపిచెర్లకు, పలమనేరు రూరల్‌లో శిక్షణ తీసుకున్న బి.జయశ్రీని ఐరాలకు, పలమనేరు రూరల్‌లో శిక్షణ తీసుకున్న ఎ.మారెప్పను పెద్దపంజాణికి, చిత్తూరు వెస్ట్ సర్కిల్‌లో శిక్షణ తీసుకున్న వి. అశోక్‌కుమార్ నాయక్‌ను చిత్తూరు తాలూకాకు, కార్వేటినగరంలో శిక్షణ తీసుకున్న ఎన్. రమే్‌షను సోమలకు, నగరి రూరల్‌లో శిక్షణ తీసుకున్న ఎన్.మల్లికార్జునను నిండ్రకు, చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్‌లో శిక్షణ తీసుకున్న డి.తేజశ్వనిని కార్వేటినగరం పీఎ్‌సకు పోస్టింగ్ ఇచ్చారు.
12 మంది సాధారణ ఎస్‌ఐల బదిలీ
జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 12 మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. సదుంలో పనిచేస్తున్న షేక్షావళిని వీకోటకు, ఎన్‌ఆర్‌పేటలో పనిచేస్తున్న నాగసౌజన్యను డీటీసీకి, సోమలలో పనిచేస్తున్న శివశంకరను చిత్తూరు మహిళా స్టేషన్‌కు, రొంపిచెర్లలో పనిచేస్తున్న సుబ్బారెడ్డిని చిత్తూరు సీసీఎ్‌సకు, తవణంపల్లెలో ఉన్న చిరంజీవిని చిత్తూరు వన్‌టౌన్‌కు బదిలీ చేశారు. అలాగే గుడుపల్లెలో ఉన్న శ్రీనివాసులును సదుంకు, వెదురుకుప్పంలో ఉన్న వెంకటసుబ్బయ్యను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న శ్రీనివాసరావును చిత్తూరు డీటీసీకి, వీఆర్‌లో ఉన్న డాక్టర్ నాయక్‌ను తవణంపల్లెకు, వీఆర్‌లో ఉన్న నవీన్‌బాబును వెదురుకుప్పంకు, వీఆర్‌లో ఉన్న పార్థసారథిని చిత్తూరు సీసీఎ్‌సకు, వీఆర్‌లో ఉన్న మునికృష్ణను చిత్తూరు సీసీఎ్‌సకు బదిలీ చేశారు. బదిలీ అయిన వారందరూ ఒకట్రెండు రోజుల్లో ఆయా స్థానాల్లో బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.