రెవెన్యూశాఖలో భారీగా బదిలీలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:35 AM
19 మంది తహసీల్దార్లు, 21మంది డీటీలకు స్థానచలనం
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 17(ఆంధ్రజ్యోతి): రెవెన్యూశాఖలో ప్రక్షాళనకు కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకారం చుట్టారు. 19 మంది తహసీల్దార్లు, 21 మంది డిప్యూటీ తహసీల్దార్లను మంగళవారం బదిలీ చేశారు. ఏళ్ల తరబడి తిష్టవేసి తిరుపతిలో ఉన్న కొంతమంది డీటీలను ఇతర మండలాలకు బదిలీ చేశారు. ఏళ్ల తరబడి కొందరు రెవెన్యూ అధికారులు తిష్టవేయడంపై ‘కదలరు.. వదలరు’ శీర్షికన ఈ నెల 7న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపైనా కలెక్టర్ దృష్టి పెట్టారు. చాలా ఏళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ప్రభుత్వాలు మారినా నేతలను అడ్డం పెట్టుకుని అదే ప్రాంతంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులకు చుక్కెదురైంది. వారిని వేరే మండలాలకు బదిలీ చేశారు. ఇక, ఆర్‌ఐలు, వీఆర్వోల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. దాదాపు బుధవారం వీరి బదిలీలు ప్రకటించే అవకాశం ఉంది.
తహసీల్దార్ల బదిలీలు ఇలా..
తిరుపతి అర్బన్ తహసీల్దారు కేపీ భాగ్యలక్ష్మిని చిన్నగొట్టిగల్లుకు.. అక్కడ పనిచేస్తున్న కె.జనార్దనరాజును శ్రీకాళహస్తికి, జిల్లా సివిల్ సప్లై్‌సలో పనిచేస్తున్న రోశయ్యను కేవీబీపురానికి, కలెక్టరేట్ ఏవో భారతిని తొట్టంబేడుకు, అక్కడ పనిచేస్తున్న మధుసూదన్‌రావును కలెక్టరేట్‌కు నియమించారు. కలెక్టరేట్ ఏవోగా రమే్‌షబాబు నియమితులయ్యారు. సత్యవేడు తహసీల్దారు టీవీ సుబ్రహ్మణ్యంను పిచ్చాటూరుకు, వరయద్యపాళెంలోని రాజశేఖర్‌ను సత్యవేడుకు, శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయ ఏవో శ్రీదేవిని బుచ్చినాయుడుకండ్రిగకు రెగ్యులర్ చేశారు. శ్రీకాళహస్తిలోని లక్ష్మీనారాయణను కలెక్టరేట్‌కు కేటాయించారు. శాంతిని శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమించారు. సూళ్లూరుపేటలోని నరసింహరావును వెంకటగిరికి, చిట్టమూరుకు సతీ్‌షకుమార్‌ను, కలెక్టరేట్‌లో ఉన్న ద్వారకనాథరెడ్డిని బాలాయపల్లికి కేటాయించి డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌కు నియమించారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన సయ్యద్ ఇక్బాల్‌ను కలెక్టరేట్‌కు కేటాయించారు. కలెక్టరేట్‌లోని ఇ సెక్షన్‌లో పనిచేస్తున్న హరికృష్ణను పెళ్లకూరుకు, చిల్లకూరు తహసీల్దారుగా శ్రీనివాసులును నియమించారు.
21 మంది డీటీలు కూడా..
చిన్నగొట్టిగల్లు ఆర్‌ఎ్‌స(రీసర్వే)డీటీగా భాస్కర్, ఎర్రావారిపాళెం వాసుదేవకుమార్, అక్కడ పనిచేస్తున్న రూప్‌చంద్‌ను వడమాలపేటకు కేటాయించారు. అక్కడ పనిచేస్తున్న సుధీర్‌ను వరదయ్యపాళెం ఇన్‌ఛార్జి తహసీల్దారుగా నియమించారు. కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న రమే్‌షరెడ్డిని కలెక్టరేట్‌కు కేటాయించారు. నారాయణవణంలో హరికృష్ణను చిన్నగొట్టిగల్లుకు.. నాగరాజును బీఎన్‌కండ్రిగకు.. చంద్రబాబును పిచ్చాటూరుకు.. పిచ్చాటూరులోని ఆర్‌ఎస్ డీటీ చెంచయ్యను కలెక్టరేట్‌కు, తొట్టంబేడులో పనిచేస్తున్న జగన్‌మోహన్‌ను శ్రీకాళహస్తి ఆర్‌ఎస్ డీటీగా నియమించారు. శ్రీకాళహస్తిలోని ప్రేమ్‌కుమార్‌ను డిప్యూటేషన్‌పై శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయానికి కేటాయించారు. తిరుపతి అర్బన్ సీఎస్ (సివిల్ సప్లయిస్) డీటీగా పనిచేస్తున్న సురేంద్రను చంద్రగిరి సీఎస్ డీటీగా, చంద్రగిరిలో పనిచేస్తున్న గంగయ్యను తిరుపతి అర్బన్ సీఎస్ డీటీగా, కలెక్టరేట్‌లోని జీవన్‌కుమార్‌ను తొట్టంబేడుకు, అక్కడి భానుచంద్‌ను నారాయణవనానికి, వెంకటగిరి సీఎ్‌సడీటీ గోపీనాథ్‌ను సూళ్ళూరుపేట ఇన్‌ఛార్జి తహసీల్దారుగా, సీఎస్ డీటీగా ఉన్న మల్లికార్జున్‌ను కోట మండలానికి, అక్కడ పనిచేస్తున్న అజంతుల్లాను వాకాడు సీఎ్‌సడీటీగా రెగ్యులర్ చేశారు. సూళ్ళూరుపేటలోని సంధ్యను అక్కడి ఆర్డీవో కార్యాలయానికి కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన గణే్‌షబాబును సూళ్ళూరుపేట ఆర్‌ఎస్ డీటీగా నియమించారు. తిరుపతి అర్బన్‌లో పనిచేస్తున్న రామచంద్రయ్య జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయానికి బదిలీ అయ్యారు.