Share News

పలువురు అధికారులకు స్థానచలనం

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:12 AM

జిల్లా బీసీ సంక్షేమాఽధికారి రాజేందకుమార్‌రెడ్డి సత్యసాయి జిల్లాకు బదిలీకాగా.. ఆయన స్థానంలో కడప నుంచి భరత్‌కుమార్‌రెడ్డిని నియమించారు.

పలువురు అధికారులకు స్థానచలనం

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): జిల్లా బీసీ సంక్షేమాఽధికారి రాజేందకుమార్‌రెడ్డి సత్యసాయి జిల్లాకు బదిలీకాగా.. ఆయన స్థానంలో కడప నుంచి భరత్‌కుమార్‌రెడ్డిని నియమించారు. సమాచార పౌరసంబంధాలశాఖ(ఐఅండ్‌ పీఆర్‌) జిల్లా అధికారి బాలకొండయ్య అనంపురం జిల్లాకు బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో గురుమూర్తిని నియమించింది. ఇక డీపీఆర్వోగా రమేష్‌ నియమితులయ్యారు.

279మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ

ఫ ముగ్గురు డిప్యూటీ ఎంపీడీవోలు కూడా..

జిల్లాలోని 279 మంది పంచాయతీ కార్యదర్శులు బుధవారం రాత్రి బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో గ్రేడ్‌తో సంబంధం లేకుండా కార్యదర్శులను నియమించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జనాభా, ఆదాయాన్ని బట్టి పంచాయతీలను విభజిచింది. ఆ ప్రకారం అర్హులైన కార్యదర్శులను నియమించేలా చర్యలు చేపట్టింది. ఇక, ఇన్‌ఛార్జిలతో కొట్టుమిట్టాడుతున్న తిరుచానూరు మేజర్‌ పంచాయతీకి రేణిగుంట పంచాయతీ కార్యదర్శి పీఎన్‌ మణిని నియమించారు. అలాగే వివిధ మండలాల్లో ఈవోపీఆర్డీ(డిప్యూటీ ఎంపీడీవో)గా పనిచేస్తున్న ముగ్గురు బదిలీఅయ్యారు. సత్యవేడులోని తరుణాక్షరెడ్డిని కేవీబీపురానికి, తిరుపతి రూరల్‌లోని మాధురిని ఎర్రావారిపాళెంకు, వడమాలపేటలోని దయాసాగర్‌ను తిరుపతి రూరల్‌కు బదిలీ చేశారు. జిల్లాలో రెవెన్యూశాఖకు సంబంధించి పదిమంది తహసీల్దార్లు, 17మంది డీటీలతోపాటు పలువురు వీఆర్వోలు కూడా బదిలీలయ్యారు. ఈ వివరాలు గురువారం అధికారికంగా వెలువడనున్నాయి. కాగా, ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా విజయవాడలో గురువారం జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు కలెక్టర్‌, జేసీ బుధవారం బయలుదేరి వెళ్లారు.

Updated Date - Jun 12 , 2025 | 01:12 AM