కొత్త టీచర్లకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:24 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొత్త ఉపాధ్యాయులకు చిత్తూరు, తిరుపతిలోని ఆరు కేంద్రాల్లో శిక్షణ తరగతులు శనివారం సైతం కొనసాగాయి. ఈనెల 10న శిక్షణ తరగతులు ముగియనున్న క్రమంలో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు.
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొత్త ఉపాధ్యాయులకు చిత్తూరు, తిరుపతిలోని ఆరు కేంద్రాల్లో శిక్షణ తరగతులు శనివారం సైతం కొనసాగాయి. ఈనెల 10న శిక్షణ తరగతులు ముగియనున్న క్రమంలో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు తగిన ఖాళీలు గుర్తించాల్సి ఉంది. ఇదిలా ఉండగా శిక్షణ సమయంలోనే కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల నుంచి ఏ ప్రాంతాల్లో పనిచేయాలని భావిస్తున్నారనే దానిపై ఆప్షన్ తీసుకుంటారని సమాచారం.