మణీంద్రం ఎంపీటీసీ టీడీపీ కైవసం!
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:26 AM
రామకుప్పం మండలంలోని మణీంద్రం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి అరుణ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందిన శాంతకుమారి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక అవసరమైంది.
రామకుప్పం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలోని మణీంద్రం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి అరుణ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందిన శాంతకుమారి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక అవసరమైంది. గత నెల 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. టీడీపీ అభ్యర్థులుగా అరుణ, విశాలాక్షి, వైసీపీ అభ్యర్థిగా అర్పిత నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 2న జరిగిన నామినేషన్ల పరిశీలనలో సాంకేతిక కారణాలతో విశాలాక్షి, అర్పిత నామినేషన్లను ఎన్నికల అధికారి తిరస్కరిం టీడీపీ అభ్యర్థి అరుణ ఒక్కరే బరిలో మిగిలారు. సోమవారం రామకుప్పం వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అరుణకు పార్టీ బీ ఫారం అందజేశారు. అనంతరం స్థానిక టీడీపీ నేతలతో కలసి బీఫాంను ఎన్నికల అధికారి లక్ష్మీకాంత్‌కు అరుణ అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుందని,ఆ గడువు ముగిసిన తర్వాత అరుణ ఎంపీటీసీగా ఎన్నికైనట్టు డిక్లరేషన్ ఫారం అందజేస్తామని ఆయన తెలిపారు.