పెరిగిన మామిడి ధరలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:49 AM
మామిడి సీజన్ ముగింపునకు వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయి. శనివారం ర్యాంపులు,మండీల వద్ద గుజ్జు పరిశ్రమలకు తరలించే తోతాపురి రకం టన్ను రూ.7 వేలు పలికింది. వారం క్రితం ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కాయలను రైతులు కోయలేదు.ఇప్పుడు ధరలు పెరగడంతో కోసి మండీలకు, ర్యాంపులకు కాయలను తీసుకొస్తున్నారు.
బంగారుపాళ్యం,జూలై 12(ఆంధ్రజ్యోతి):మామిడి సీజన్ ముగింపునకు వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయి. శనివారం ర్యాంపులు,మండీల వద్ద గుజ్జు పరిశ్రమలకు తరలించే తోతాపురి రకం టన్ను రూ.7 వేలు పలికింది. వారం క్రితం ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కాయలను రైతులు కోయలేదు.ఇప్పుడు ధరలు పెరగడంతో కోసి మండీలకు, ర్యాంపులకు కాయలను తీసుకొస్తున్నారు. శనివారం జిల్లా ఉద్యానవన శాఖాధికారి మధుసూదన రెడ్డి, ఏడీ కోటేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్ బంగారుపాళ్యం మండలంలోని ర్యాంపులను,మండీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మధుసూదన రెడ్డి మాట్లాడుతూ ర్యాంపులకు,మండీలకు తోతాపురి రకం తరలించే రైతులు తప్పని సరిగా పట్టాదారుపాసుస్తకం, ఆధార్, బ్యాంకు పాసు బుక్ అధికారులకు అందజేస్తే ప్రభుత్వం రూ.4 రూపాయల సబ్బిడీ వారి ఖాతాలకు జమ చేస్తుందని తెలిపారు. ఈ నెల చివరి వరకు కాయలను కొనుగోలు చేస్తామని,మామిడి ధరలు పెరిగే అవకాశాలున్నందున రైతులు అదును చూసి కాయలు కోసుకోవాలని సూచించారు.శనివారం మార్కెట్‌కు టేబుల్ రకాల మామిడి కవర్ బేనీషా టన్ను రూ. 60 వేల నుంచి 70 వేలు, కవరు కట్టని బేనీషా టన్ను రూ. 20 వేల నుంచి రూ.45 వేలు , కవర్ కట్టిన తోతాపురి రకం టన్ను రూ. 22వేలు, కవరు కట్టని తోతాపురి టన్ను రూ. 9వేల నుంచి 11 వేలు ధర పలకగా నీలం టన్ను రూ.7 వేల నుంచి రూ.26 వేల వరకు పలికింది.