మామిడి రైతులూ.. ఆందోళన పడొద్దు
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:27 AM
మామిడి రైతులూ ఆందోళన పడొద్దు.. చివరి కిలో వరకు తోతాపురి రకాన్ని కొంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డులో మండీ యజమానులు, మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రాదని భావించి.. పక్వానికి రాకముందే మామిడి కాయలను కోసి గుజ్జుపరిశ్రమలకు తరలించరాదని రైతులకు సూచించారు. ఆగస్టు నెల వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా నుంచి అధికారుల కమిటీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరికి పంపామని, రైతుల నుంచి మామిడి కొనుగోలు, నగదు ఇచ్చే విధానాన్ని పరిశీలించి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారని చెప్పారు. ర్యాంపులు, ఫ్యాక్టరీల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయిస్తామన్నారు. తోతాపురి రకాన్ని గుజరాత్‌లోని బలగాం మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. జేసీ కలెక్టర్ విద్యాధరి, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ పరమేశ్వరన్, తహసీల్దార్ బాబూ రాజేంద్రప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటరమణ, సూపర్‌వైజర్ గంగయ్య, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.
- తోతాపురి రకాన్ని చివరి కిలో వరకు కొంటాం: కలెక్టర్
బంగారుపాళ్యం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతులూ ఆందోళన పడొద్దు.. చివరి కిలో వరకు తోతాపురి రకాన్ని కొంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డులో మండీ యజమానులు, మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ రాదని భావించి.. పక్వానికి రాకముందే మామిడి కాయలను కోసి గుజ్జుపరిశ్రమలకు తరలించరాదని రైతులకు సూచించారు. ఆగస్టు నెల వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా నుంచి అధికారుల కమిటీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరికి పంపామని, రైతుల నుంచి మామిడి కొనుగోలు, నగదు ఇచ్చే విధానాన్ని పరిశీలించి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారని చెప్పారు. ర్యాంపులు, ఫ్యాక్టరీల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయిస్తామన్నారు. తోతాపురి రకాన్ని గుజరాత్‌లోని బలగాం మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. జేసీ కలెక్టర్ విద్యాధరి, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ పరమేశ్వరన్, తహసీల్దార్ బాబూ రాజేంద్రప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటరమణ, సూపర్‌వైజర్ గంగయ్య, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.
గుజ్జు పరిశ్రమను పరిశీలించిన జేసీ
నలగాంపల్లె వద్ద ఉన్న సన్‌గోల్డ్ గుజ్జు పరిశ్రమను గురువారం ఉదయం జేసీ విద్యాధరి పరిశీలించారు. మేనేజర్ ధనంజయనాయుడితో మాట్లాడారు. రైతుల నుంచి ప్రభుత్వం ప్రకటించిన ధరకు మామిడి కొనుగోలు చేయాలని సూచించారు. పర్మిట్‌లు ఇప్పించాలని రైతులు కోరగా... ఈనెల 30వ తేదీ వరకు మంజూరు చేసేశామని జేసీకి మేనేజర్ తెలిపారు. ఉద్యానశాఖ అధికారి కోటేశ్వర్‌రావు, ఏవో భారతి, తహసీల్దార్ తదితరులున్నారు.