Share News

విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:48 AM

జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఆ మేరకు అధ్యాపక పోస్టులు గల్లంతయ్యే ప్రమాదం ఉందని నూతన జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి (డీఐఈవో) శ్రీనివాసులు తెలిపారు. గురువారం డీఐఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం మే నెలాఖరు వరకు వేసవి సెలవులు ఉన్నా.. సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులకు కళాశాలల్లో రెమిడియల్‌ తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు. కళాశాలల బలోపేతంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు చెప్పారు. కాగా, డీఐఈవోను ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు కలిసి అభినందనలు తెలిపాయి.

విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి

- లేదంటే అధ్యాపకుల

పోస్టులూ గల్లంతవుతాయి!

- నూతన డీఐఈవో శ్రీనివాసులు

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఆ మేరకు అధ్యాపక పోస్టులు గల్లంతయ్యే ప్రమాదం ఉందని నూతన జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి (డీఐఈవో) శ్రీనివాసులు తెలిపారు. గురువారం డీఐఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం మే నెలాఖరు వరకు వేసవి సెలవులు ఉన్నా.. సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులకు కళాశాలల్లో రెమిడియల్‌ తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు. కళాశాలల బలోపేతంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు చెప్పారు. కాగా, డీఐఈవోను ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు కలిసి అభినందనలు తెలిపాయి.

Updated Date - Apr 25 , 2025 | 01:48 AM