Share News

మహిళాగ్రహం

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:15 AM

అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా సాక్షి ఛానెల్‌ డిబేట్‌లో కారుకూతలు కూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరులో మంగళవారం తెలుగుమహిళలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. నాగయ్య కళాక్షేత్రం నుంచి ఎమ్మెస్సార్‌ సర్కిల్‌ మీదుగా ర్యాలీ నిర్వహించిన మహిళలు గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు కేఎ్‌సఆర్‌, కృష్ణంరాజు, వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చిత్రపటాలను ,సాక్షి పత్రికలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ అమరావతిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్‌ రెడ్డి సాక్షి మీడియాలో తన అనుచరులతో ఇలా కారుకూతలు కూయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న సాక్షి చానల్‌ను ఆపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.టీడీపీ చిత్తూరు పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మేయర్‌ అముద, విక్టోరియా, వరలక్ష్మి, నాగలక్ష్మి, ప్రతిభ, ఉదయ, అను, భువనేశ్వరి, పద్మ, రేవతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

మహిళాగ్రహం
చిత్తూరులో తెలుగు మహిళల ర్యాలీ

  • అమరావతి మహిళలను కించపరచడంపై

చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీలు

చిత్తూరు సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా సాక్షి ఛానెల్‌ డిబేట్‌లో కారుకూతలు కూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరులో మంగళవారం తెలుగుమహిళలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. నాగయ్య కళాక్షేత్రం నుంచి ఎమ్మెస్సార్‌ సర్కిల్‌ మీదుగా ర్యాలీ నిర్వహించిన మహిళలు గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు కేఎ్‌సఆర్‌, కృష్ణంరాజు, వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చిత్రపటాలను ,సాక్షి పత్రికలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ అమరావతిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్‌ రెడ్డి సాక్షి మీడియాలో తన అనుచరులతో ఇలా కారుకూతలు కూయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న సాక్షి చానల్‌ను ఆపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.టీడీపీ చిత్తూరు పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మేయర్‌ అముద, విక్టోరియా, వరలక్ష్మి, నాగలక్ష్మి, ప్రతిభ, ఉదయ, అను, భువనేశ్వరి, పద్మ, రేవతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ మీడియా పైశాచికత్వం

కుప్పం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలపై అనుచితంగా కారుకూతలు కూసి వారి శీల హననానికి ఒడిగట్టిన సాక్షి మీడియా పైశాచికత్వం అమానుషమైనదని తెలుగు మహిళలు ధ్వజమెత్తారు. సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కుప్పంలో మంగళవారం తెలుగు మహిళలు పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంనుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండు కూడలిదాకా సాగింది. ఇక్కడ మానవహారంగా ఏర్పడ్డ తెలుగు మహిళలు, జగన్‌ మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే జగన్‌ మీడియాను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళల శీల హననానికి పాల్పడే హీనమైన వ్యాఖ్యలు ఇంకెవరూ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నీచ వ్యాఖ్యలకు బాధ్యులైన కొమ్మినేని శ్రీనివాస్‌, కృష్ణంరాజులకు చట్టపరంగా తీవ్ర దండన విధించాలని డిమాండ్‌ చేశారు. సాక్షి మీడియా, జగన్‌రెడ్డి దిష్టిబొమ్మలను చెప్పులతో దండించి దహనం చేశారు.

Updated Date - Jun 11 , 2025 | 01:15 AM