స్థానికాలయాలకు మహర్దశ
ABN , Publish Date - May 20 , 2025 | 02:14 AM
టీటీడీకి అనుబంధంగా ఉన్న స్థానికాలయాల అభివృద్ధిపై పాలకమండలి ప్రత్యేక దృష్టిపెట్టనుంది. భక్తులకు మెరుగైన సేవలు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి శ్రీవారి ఆలయం, అప్పలాయగుంట, నారాయణవనం, పాపవినాశనం, ఆకాశగంగ తదితర ప్రాంతాలపై టీటీడీ ఫోకస్ పెట్టనుంది. ఆమేరకు మంగళవారం జరగనున్న టీటీడీ పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆమోదం తెలపనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ నిర్ణయాలు ఉండబోతున్నాయి. సీఎం సూచించే పొదుపు మంత్రాన్ని పాటిస్తూ, శ్రీవారి నిధులను ఆర్భాటాలకోసం దుర్వినియోగం చేయకుండా ఎంతమేర అవసరమే ఆ దిశగా ఖర్చుపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఎంచుకోనున్నట్టు సమాచారం.
- భక్తులకు మెరుగైన సేవలకు పెద్దపీట
- పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తు
- పైలెట్ ప్రాజెక్టుగా తిరుచానూరు అమ్మవారి ఆలయం
- నేటి టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం
తిరుపతి- ఆంధ్రజ్యోతి
టీటీడీకి అనుబంధంగా ఉన్న స్థానికాలయాల అభివృద్ధిపై పాలకమండలి ప్రత్యేక దృష్టిపెట్టనుంది. భక్తులకు మెరుగైన సేవలు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి శ్రీవారి ఆలయం, అప్పలాయగుంట, నారాయణవనం, పాపవినాశనం, ఆకాశగంగ తదితర ప్రాంతాలపై టీటీడీ ఫోకస్ పెట్టనుంది. ఆమేరకు మంగళవారం జరగనున్న టీటీడీ పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆమోదం తెలపనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ నిర్ణయాలు ఉండబోతున్నాయి. సీఎం సూచించే పొదుపు మంత్రాన్ని పాటిస్తూ, శ్రీవారి నిధులను ఆర్భాటాలకోసం దుర్వినియోగం చేయకుండా ఎంతమేర అవసరమే ఆ దిశగా ఖర్చుపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఎంచుకోనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం రోజుకు 30వేల మంది భక్తులు అలమేలు మంగమ్మను దర్శించుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 40వేలకు చేరే అవకాశం ఉందని టీటీడీ అధికారుల అంచనా. ఆ దిశగా అవసరమైన మౌలిక వసతులపై టీటీడీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎటువైపు నుంచి వచ్చినా తిరుచానూరు ఆలయానికి వెళ్లే మార్గాలు తెలిసేలా నలువైపులా ఆర్చిలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. తోళప్ప గార్డెన్, ఫ్రైడే గార్డెన్ సుందరీకరణ, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. క్యూలైన్లు, కాలం చెల్లిన కల్యాణ మండపాల ఆధునికీకరణపైనా దృష్టి పెట్టనున్నారు.
సత్రాలపై విచారణకు నిర్ణయం?
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి బాగుచేసిన గోవిందరాజ స్వామి సత్రాలను పూర్తిగా కూల్చివేసి కొత్తవి నిర్మించేందుకు రూ.600కోట్లు కేటాయిస్తూ గత వైసీపీ పాలనలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేటాయింపుల వెనుక కాంట్రాక్టర్ నుంచి పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయన్న విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై విచారణకు పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.