Share News

వైభవంగా అగ్నిగుండ మహోత్సవం

ABN , Publish Date - May 20 , 2025 | 02:04 AM

కుప్పంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర వైభవంగా జరుగుతోంది. సోమవారం రాత్రి ముత్తుమారెమ్మ అగ్నిగుండ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయంలో సర్వాంగ సుందరంగా ఆభరణాలు, పూలమాలలతో అలంకరించిన ముత్తుమారెమ్మకు పూజలు చేశారు. అనంతరం పట్టణంలోని అగ్నిగుండ ప్రదేశానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి కంకణాలు ధరించి దీక్షలో ఉన్న భక్తులు, పవిత్ర స్నానాలు ఆచరించారు. గెరిగ పట్టుకున్న పూజారి తొలుత అగ్నిగుండంలో పాదం మోపారు. ఆయన వెంట ముత్తుమారెమ్మ అగ్నిగుండ ప్రవేశం చేసింది. గంగమ్మా.. మాయమ్మా.. అన్న భక్తుల నినాదాలతో, డప్పుల మోతలతో పరిసరాలు ఒక్కసారిగా మార్మోగాయి. కుప్పమే కాక మూడు రాష్ట్రాలనుంచి తరలివచ్చిన భక్తజనంతో పట్టణం జనసంద్రమైంది. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అంతకుముందు ఉదయం గంగమ్మ శిలా విగ్రహానికి క్షీరాభిషేకం. గంధాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, జాతర ఉత్సవ కమిటీ ప్రథమ సభ్యుడు బీఎంకే.రవిచంద్రబాబు, టీడీపీ కుప్పం మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా అగ్నిగుండ మహోత్సవం
- అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న భక్తులు

కుప్పం, మే 19 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర వైభవంగా జరుగుతోంది. సోమవారం రాత్రి ముత్తుమారెమ్మ అగ్నిగుండ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయంలో సర్వాంగ సుందరంగా ఆభరణాలు, పూలమాలలతో అలంకరించిన ముత్తుమారెమ్మకు పూజలు చేశారు. అనంతరం పట్టణంలోని అగ్నిగుండ ప్రదేశానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి కంకణాలు ధరించి దీక్షలో ఉన్న భక్తులు, పవిత్ర స్నానాలు ఆచరించారు. గెరిగ పట్టుకున్న పూజారి తొలుత అగ్నిగుండంలో పాదం మోపారు. ఆయన వెంట ముత్తుమారెమ్మ అగ్నిగుండ ప్రవేశం చేసింది. గంగమ్మా.. మాయమ్మా.. అన్న భక్తుల నినాదాలతో, డప్పుల మోతలతో పరిసరాలు ఒక్కసారిగా మార్మోగాయి. కుప్పమే కాక మూడు రాష్ట్రాలనుంచి తరలివచ్చిన భక్తజనంతో పట్టణం జనసంద్రమైంది. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అంతకుముందు ఉదయం గంగమ్మ శిలా విగ్రహానికి క్షీరాభిషేకం. గంధాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, జాతర ఉత్సవ కమిటీ ప్రథమ సభ్యుడు బీఎంకే.రవిచంద్రబాబు, టీడీపీ కుప్పం మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 02:04 AM