Share News

పోలీసుల అదుపులో మధ్యప్రదేశ్‌ గ్యాంగ్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:08 AM

పలు రాష్ట్రాల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌ను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలు, దారి దోపిడీలు చేయడంలో ఆరితేరిన ఈ ముఠాలోని ఇద్దరిని పట్టుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 మంది బృందాలుగా విడిపోయి.. ఒక్కో టీము ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దోపిడీ, దొంగతనాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు.. గతేడాది తిరుచానూరు, గాజులమండ్యంలోని మూడు ఇళ్లల్లో బెదిరించి బంగారు నగలు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, నగదు అపహరించుకుని వెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు వంటి నగరాల్లో దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిపై పలు ప్రాంతాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. గతంలో కేరళ పోలీసులు అరెస్టు చేయగా, అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులోనూ పెద్ద, పెద్ద భవంతులు, కారు షోరూములు, ఎలక్ర్టానిక్‌ షోరూములను ఎంచుకుని 10 రోజుల పాటు రెక్కీ నిర్వహించాక అర్ధరాత్రి పూట చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే వీరు రాష్ట్ర, జాతీయ రహదారులపై కాపుకాచి వాహనాలు ఆపి ఉంటే.. తుపాకులు, రాడ్లతో భయపెట్టి దోపిడీకి పాల్పడుతుంటారని సమాచారం.

పోలీసుల అదుపులో మధ్యప్రదేశ్‌ గ్యాంగ్‌

.చోరీలు, దోపిడీలకు పాల్పడిన ముఠా

. వేలి ముద్రలు, కనుబొమ్మల ఆధారంగా పట్టుకున్న పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): పలు రాష్ట్రాల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌ను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలు, దారి దోపిడీలు చేయడంలో ఆరితేరిన ఈ ముఠాలోని ఇద్దరిని పట్టుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 మంది బృందాలుగా విడిపోయి.. ఒక్కో టీము ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దోపిడీ, దొంగతనాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు.. గతేడాది తిరుచానూరు, గాజులమండ్యంలోని మూడు ఇళ్లల్లో బెదిరించి బంగారు నగలు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు, నగదు అపహరించుకుని వెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు వంటి నగరాల్లో దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిపై పలు ప్రాంతాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. గతంలో కేరళ పోలీసులు అరెస్టు చేయగా, అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులోనూ పెద్ద, పెద్ద భవంతులు, కారు షోరూములు, ఎలక్ర్టానిక్‌ షోరూములను ఎంచుకుని 10 రోజుల పాటు రెక్కీ నిర్వహించాక అర్ధరాత్రి పూట చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే వీరు రాష్ట్ర, జాతీయ రహదారులపై కాపుకాచి వాహనాలు ఆపి ఉంటే.. తుపాకులు, రాడ్లతో భయపెట్టి దోపిడీకి పాల్పడుతుంటారని సమాచారం.

ఎలా పట్టుబడ్డారంటే..

తిరుపతి నగరం కాటన్‌మిల్లు.. రూరల్‌లో దామినేడు వద్ద రెండు మారుతీ కారు షోరూముల్లో సిబ్బంది కాళ్లు, చేతులు కట్టేసి రూ.7.30 లక్షలు నగదు అపహరించుకుని వెళ్ళారు. దీనిని సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు.. ఈ ముఠాపై దృష్టి పెట్టారు. ఘటన జరిగిన ప్రాంతాల నుంచి వేలి ముద్రలు సేకరించారు. తిరుపతి ఫింగర్‌ ప్రింట్‌ పోలీసుల వద్ద ఉన్న పాత నేరస్థులు, దోపిడీదారుల వేలి ముద్రలతో పరిశీలించారు. ఇందులో మధ్యప్రదేశ్‌కు చెందిన దోపిడీ దొంగ వేలి ముద్రలతో సరిపోవడంతో ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, మరో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, సిబ్బందిని మూడు టీమ్‌లుగా విభజించి బెంగళూరు, మధ్యప్రదేశ్‌కు ఎస్పీ హర్షవర్ధన రాజు పంపారు. అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుని దోపిడీ దొంగల మొబైల్‌ నెంబర్లు, ఆధార్‌ కార్డుల ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టి ఇద్దరిని పట్టుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. వీరు దాదాపు 10 ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇదే ముఠాలో మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 01:08 AM