ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌కు నేడు ప్రారంభోత్సవం
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:24 AM
పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లె వద్ద రూ.200 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
-వర్చువల్‌గా పాల్గొంటున్న ప్రధాని,సీఎం
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లె వద్ద రూ.200 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కర్నూలు పర్యటనకు వస్తున్న ఆయన అక్కడినుంచే వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌ను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, సహాయమంత్రి సురేష్ గోపి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తదితరులు పాల్గొంటారు.చిత్తూరు, కడప జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన సుమారు ఏడులక్షల మంది గ్యాస్ వినియోగదారులకు ఈ బాట్లింగ్ ప్లాంట్ ఉపయోగపడనుంది.