Share News

లోక్‌ అదాలత్‌ విజయవంతం

ABN , Publish Date - Dec 14 , 2025 | 02:17 AM

లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి అరుణసారిక అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు.

లోక్‌ అదాలత్‌ విజయవంతం
కక్షిదారులకు పత్రాలు పంపిణీ చేస్తున్న జిల్లా జడ్జి అరుణ సారిక

చిత్తూరు లీగల్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి అరుణసారిక అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు క్షణికావేశంలో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఏదైనా సమస్య ఉంటే కోర్టుల చుట్టూ తిరగకుండా గ్రామ పెద్దల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు తమవంతు కృషిచేయాలన్నారు. అనంతరం లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కారమైన కక్షిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ల ద్వారా 13,297 కేసులు పరిష్కారమయ్యాయి.వీటిలో తిరుపతిలో 2646, చిత్తూరులో 1201, మదనపల్లెలో 1296, పలమనేరులో 1244,తంబళ్లపల్లెలో 859,కుప్పంలో 444, పుంగనూరులో 1289, శ్రీకాళహస్తిలో 750, సత్యవేడులో 924, పుత్తూరులో 619, పాకాలలో 595, వాయల్పాడులో 61, పీలేరులో 857,నగరిలో 448 కేసులు వున్నాయి.

Updated Date - Dec 14 , 2025 | 02:17 AM