తార్కిక ఆలోచనలే విజయానికి సోపానాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:38 AM
తార్కిక ఆలోచనల ద్వారా పోటీపరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చని నవలారచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. ఎంఆర్‌పల్లెసర్కిల్‌లోని కౌటిల్య ఇన్‌స్టిట్యూట్‌లో స్టెప్ ఫర్ సక్సెస్ అనే అంశంపై విద్యార్థులకు గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఫయండమూరి వీరేంద్రనాథ్
తిరుపతి రూరల్, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): తార్కిక ఆలోచనల ద్వారా పోటీపరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చని నవలారచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. ఎంఆర్‌పల్లెసర్కిల్‌లోని కౌటిల్య ఇన్‌స్టిట్యూట్‌లో స్టెప్ ఫర్ సక్సెస్ అనే అంశంపై విద్యార్థులకు గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. వివిధ పోటీల్లో విజయానికి వ్యూహాలు, నాయకత్వ లక్షణాలు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి మెళకువలు, మొబైల్‌ఫోన్ నుంచి విముక్తి, ఒత్తిడి నిర్వహణ వంటి విషయాలపై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ..ఆరోగ్యం, కీర్తి, సంపద, ప్రేమ, ఉత్సాహం విజయానికి నిర్వచమన్నారు. మానసిక ఆరోగ్యమున్న వ్యక్తి భయం, దుఖం, కోపం అనే మూడు రకాల వ్యాధుల నుంచి బయటపడుతాడాన్నరు. వైఫల్యాలని విజయాలకు దారితీసే మెట్లుగా మార్చుకోవడమన్నది పాత పంథాఅన్నారు. వైఫల్యమే లేనంతగా కృషి చేయడమనది నేటి పోటీ ప్రపంచంలో కొత్త ఒరవడి అన్నారు. స్మార్ట్ ఫోన్లతో విలువైన సమయాన్ని వృఽథా చేసుకోవద్దన్నారు. అనవసర స్నేహాల వల్ల ఉన్నతికి అడ్డుకట్టపడుతుందన్నారు. లీడర్‌షిష్, కామన్‌సెన్స్, కమ్యూనికేషన్, తెలివి లక్షణాలను కలిగి ఉంటే జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని విద్యార్థుల్లో చైతన్యం నింపారు. సంస్థ డైరెక్టర్ శ్రీధర్ తదితరులు మాట్లాడారు.