Share News

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:23 AM

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి మురుగన్‌ కోరారు. తిరుపతి నగరం త్యాగరాజ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘ఖాదీ సంత’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఈ వస్తువు మా ఊరుది’ అని గొప్పగా చెప్పుకొనే పరిస్థితి రావాలన్నారు. ఆ దిశగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి మన పారిశ్రామిక వేత్తలు ఆర్ధికంగా నిలదొక్కునేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా లాంటి దేశాలు ఎన్ని అంక్షలు పెట్టినా భయపడే పరిస్థితి లేదన్నారు. అనంతరం ఆయన స్టాళ్లను సందర్శించారు. కళంకారి వస్త్రాలు, దారుశిల్పాలు తదితరాలను పరిశీలించారు. హస్తకళల కార్పొరేషన్‌ చైర్మన్‌ పసుపులేటి హరిప్రసాద్‌, ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిని గుండాల గోపీనాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. కాగా, రెండు రోజులపాటు జరిగిన ఈ ఖాదీ సంతలో ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
స్టాల్‌ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి మురగన్‌

  • ‘ఖాదీ సంత’ ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురుగన్‌

తిరుపతి(కల్చరల్‌), అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి మురుగన్‌ కోరారు. తిరుపతి నగరం త్యాగరాజ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘ఖాదీ సంత’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఈ వస్తువు మా ఊరుది’ అని గొప్పగా చెప్పుకొనే పరిస్థితి రావాలన్నారు. ఆ దిశగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి మన పారిశ్రామిక వేత్తలు ఆర్ధికంగా నిలదొక్కునేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా లాంటి దేశాలు ఎన్ని అంక్షలు పెట్టినా భయపడే పరిస్థితి లేదన్నారు. అనంతరం ఆయన స్టాళ్లను సందర్శించారు. కళంకారి వస్త్రాలు, దారుశిల్పాలు తదితరాలను పరిశీలించారు. హస్తకళల కార్పొరేషన్‌ చైర్మన్‌ పసుపులేటి హరిప్రసాద్‌, ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిని గుండాల గోపీనాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. కాగా, రెండు రోజులపాటు జరిగిన ఈ ఖాదీ సంతలో ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 02:23 AM